Skip to main content

అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో విశిష్ఠమైన భూలోకంలో ధర్మజ్యోతులను ప్రజ్జ్వలింప చేయాలనే శ్రీశైవక్షేత్ర నిర్మాణ సంకల్పం
శ్రీశైవక్షేత్ర దర్శన ఫలసూక్తములు (వివరణ) వ్యాఖ్యానము
శివమతధర్మస్థాపన – శివతత్త్వ ప్రచారం శివమందిరాల నిర్మాణం

యుగాలు మారినట్లు యుగధర్మాలు మారుతాయి. ఈ కలియుగంలో శివారాధనను మించినది మరొకటి లేదు. కుల, మత, జాతి, వర్గ, వర్ణ, లింగ, వయోభేదములు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రేమతో కూడిన ఆనందమయ జీవితాన్ని పొందాలి. ఆనందమే శివుడు. ప్రతి ఒక్కరు భగవంతునికి స్వయంగా సేవచేసుకునే భాగ్యాన్ని కలుగ చేయాలనే సదుద్దేశంతో శ్రీ పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాద బలంతో ఇక్కడ దివ్యసిద్ధ శ్రీశైవక్షేత్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. విశ్వశాంతి కొరకు లోకకళ్యాణార్థం శివమతస్థాపన, శివతత్త్వ ప్రచారంతో, అఖిలాండకోటి బ్రహ్మాండాలలో విశిష్ఠమైన భూలోకంలో ధర్మజ్యోతులను ప్రజ్జ్వలింపచేయాలనే అఖండ సంకల్పమే.

శ్రీశైవక్షేత్రము – శ్రీ శివక్షేత్రము- భూకైలాసము

శ్లో॥ శ్రీశైవక్షేత్రసమాగమమ్ |

కలికల్పమష తిరోగమమ్

అనగా కలియుగములోని మానవులంతా యుగధర్మ ప్రకారము కలిపురుషుని యొక్క దుష్ట స్వభావజనితములైన పాపకర్మాచరణాసక్తులై వారివారి స్వధర్మములను విడిచి కలుషాత్ములై చరింతరు. యిది ఈ కలియుగ ధర్మము, కలియుగమున కాలమంతయు దోషములచే నిండియుండునుగాన నట్టి కాలమును లక్ష్యపెట్టక నేరిక నుండరాదు. లోకమంతయు పాప పంకిలమై పుణ్యము నాచరింపకుండును. బ్రాహ్మణ క్షత్రియ ద్వివర్ణముల యాచారములు లోపించుట, వర్ణ సంకరము సంప్రాప్తమై ప్రజలు తమ యధికారమును పోగొట్టుకొని గొప్పవారు తుచ్చ స్థితికి వచ్చుట, నీచులు ఉన్నత పదవులు సధిష్ఠించుట, సదుపదేశము ఉపయోగింపక గురుశిష్య క్రమము భంగపడును.

ఇది కలిపురుషుని యొక్క దుష్ట స్వభావజనిత ఫలితము. ఇట్టి కలిపురుషుని యొక్క ప్రకోపజనిత దురితములకు తగుల్కొనకు మానవుడు ఆ దురితముల నుండి తప్పించుకొని వారివారి స్వధర్మములను పాటించి భగవదానుగ్రహము పొందవలెనన్న, పరిపూర్ణ శివకటాక్షంతో భూకైలాసంగా అవతరించిన ఈ శ్రీశైవక్షేత్రమునకు సద్భుద్ధితో వచ్చి – క్షేత్ర దర్శనము చేసుకొన్న ఆ మరుక్షణమే అతనిలో నున్న కలికల్మష దోష మంతయు రుద్రుని యొక్క రౌద్రానలవీక్షణ తాకిడికి పటాపంచలై కలి తిరోగమించును – (అనగా కల్మషమంతయు ఆ భక్తుని విడిచి వెడలిపోవును.)

కలిదోషములు అనివార్యములుగా గల మానవులు పరమేశ్వరుని యందు భక్తి కలవారై స్వయంభు, దైవ, ఋషి, మానుష్య నిర్మిత శివాలయాలలో అభిషేకార్చనలు చేసిన యెడల సంసారబంధముల నుండి విముక్తులగుదురు.

కృష్ణవేణి స్నానదమ్ – సకలతీర్థ స్నానదమ్

అనగా శ్రీశైవక్షేత్రము పరమ పవిత్రవంతమైన కృష్ణవేణి నదితో అనుసంధింపబడియున్నది. ఈ కృష్ణానది మహాపణ్యప్రదమె పరమ పవిత్రమైన పంచమహానదులలో ఒకటిగా మహర్షులచే శ్లాఘించబడినది. పంచమహానదులు అనగా 1. గంగానది 2. కావేరి 3. గోదావరి 4. తుంగభద్ర 5. కృష్ణానది. యివి పంచమహానదులుగా ప్రసిద్ధికెక్కినవి. యిట్టి పంచమహానదులలో ఒకటిగా మహర్షులచే శ్లాఘించబడి పవిత్ర కృష్ణానదీ తీరముతో ఈ శైవక్షేత్రము అనుసంధింపబడియున్నది. ఇట్టి పుణ్యతీర్థమందు మానవుడొక్కసారి స్నానమాచరించిన యెడల ఆ మానవుని యొక్క దుష్కర్మలన్నియు నశించి పుణ్యప్రదములైన సకల తీర్ధములలోనూ స్నానమాచరించిన ఫలము మానవుడు పొందును. తీర్థమనగా మహర్షులు స్నానమాడెడి పుణ్య జలములని అర్ధము. యిట్టి పుణ్యజలపూరితములై ప్రకాశించు కృష్ణానది ఒడ్డున శివసంకల్పబలముతో వెలసియున్నది ఈ శ్రీశైవక్షేత్రము మరొక్క విషయమేమన మనమాచరించెడి పుణ్యకార్యములు స్థల భేదము ననుసరించి ఫలమధికమగుచుండును. అనగా మనము యింటిలో చేసుకొనెడి పూజాదికములు దేవాలయ ప్రాంగణమున ఆచరించిన యెడల శతాధిక ఫలమునిచ్చును అనగా నూరురెట్లు ఫలమధికమగును. అవే పూజాదికములు యిట్టి నదీతీరములో చేసిన యెడల ఆ ఫలమును మానవుడు సహస్రాధికముగా పొందును. అనగా నదీ తీరములలో గావించెడి పూజాదికములకు వేయిరెట్లు ఫలితముండునని యిది పురాణవచనం. కనుక పంచమహానదులతో ఒకటిగా శ్లాఘించబడిన ఈ కృష్ణానదీ తీరమందు శివకటాక్షముతో నిర్మింతమైన ఈ శైవక్షేత్రంలో మనము చేసిన లేక చేయించుకొన్నట్టి నిత్య ఆర్చనాభిషేకములు, నిత్య పార్ధివ లింగార్చనలు, నిత్యశివపంచాయతనార్చనలు, నిత్యహోమాదికములు, నిత్య మహానైవేద్యాదులు, నిత్యాన్నదానములు, నిత్య కళ్యాణమహోత్సవములు ఒకసారి చేయించుకొనిన యెడల పురాణవచన ప్రకారము ఆ ఫలము సహస్రాధికమై అనేకగా వేయిరెట్లయి వారిని కాపాడుచుండును. కనుక యిది యిట్లు శ్లాఘ్యము.

గోమాత – గోసేవ

గోశాల దర్శనమ్ – సకల కార్యశుభప్రదమ్

గోవు సర్వదేవతలకు ప్రతీక. గోవును ధర్మదేవతా స్వరూపముగా మహర్షులు పేర్కొనిరి. గోవు యొక్క శరీరము నాశ్రయించి సమస్త దేవతలు యుందురు. అందువల్ల గోవును దర్శించి సేవించిన యెడల సమస్త దేవతలను దర్శించి సేవించిన ఫలమును మానవుడు పొందును. అందువల్లనే మహర్షులంతా తమ తమ ఆశ్రమములయందు విధిగా గోవులను పెంచి పోషించెడివారు. అంతేయేగాక గో ప్రదక్షిణము భూప్రదక్షిణముతో సమానమని, అందులోని ద్విముఖీ గోవును దర్శించి ప్రదక్షిణ గావించిన మానవునికి యావద్భూమండల ప్రదక్షిణ చేసిన ఫలము పొందునని పురాణవచనం. ఈ ధర్మసూత్రమాధారంగానే గౌతమమహర్షి అహల్యను వివాహమాడినట్లుగా బ్రహ్మాండ పురాణ వచనం. అది యెట్లనిన పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు అపురూప సౌందర్యవతియగు అహల్యను సృష్టించెను. అంత దేవతలంతా ఆమెను వివాహమాడ గోరి రాగా అంత బ్రహ్మదేవుడు యెవరు ముందుగా ముమ్మారు భూమండల ప్రదక్షిణ గావించి వచ్చెదరో వారికే యామెనిచ్చి వివాహ మొనర్తుననెను. అంత సూర్యేంద్రులు మిగిలిన దేవతలు, ఆమెనువ ఇవాహమాడగోరి ముందుగా ప్రదక్షిణలకు బయలువెడలిరి. అంత నారదుడు యిదంతయు తెలుసుకొని, ఆయన దివ్యజ్ఞాన సంపన్నుడు కనుక ఈమెను సృష్టించడంలోని బ్రహ్మదేవుని ఆంతర్యాన్ని గ్రహించి ఆమెకు తగిన భర్తను కూడా దివ్యజ్ఞానంతో తెలుసుకొన్నాడు. ఆ వరుడే గౌతమ మహర్షి నారదులవారు వెంటనే ఆ గౌతముని ఆశ్రమమును వెళ్ళి గౌతముని దర్శించి జరిగిన విషయమంతా జెప్పి అహల్యకు తగిన వరుడవు నీవేనని, ఆమెను వివాహమాడుమని గౌతముని ప్రేరేపించెను. అంత మహర్షి నారదా! ఈమెను వివాహమాడవలెనన్న కోర్కెతో సూర్యుడు, యింద్రుడు యెందరో దేవతలు భూమండల ప్రదక్షిణకు బయలువెడలి చాలా సేపయినది కదా! యిప్పుడు బయలుదేరిన యెడల కృతకృత్యుడను కాగలనా! అని నారదునితో అనగా అంతలో నారదుడు గౌతమాశ్రయలములో సగమీనియున్న ద్విముఖీగోవును జూచెను. వెంటనే గౌతములవారికి ఆ గోవును జూపి గౌతమా! నీకు తెలియని ధర్మశాస్త్రాలు లేవుగదా! అటుజూడు అని ద్విముఖీ గోవును జూపెను. ద్విముఖీగోవు అంటే యీనుతున్నగోవు అని అర్థము. ఈనుతున్నగోవు యొక్క జనన స్థానమునుండి దూడ యొక్క శిరస్సు సంపూర్ణముగా యివలకు వచ్చిన సమయంలో అది ఒక శిరస్సుగాను గోవుయొక్క శిరస్సు రెండవదిగా నిర్ణయించి ఆ గోవు ఆ సమయంలో మాత్రమే ద్విముఖీగోవుగా పరిగణింపబడుతుంది. దూడ భూపతనమయిన దంటే ఆ గోవు మాములు గోవు మాత్రమే. అనగా ద్విముఖీకాదు. అట్టి గోవును గౌతములవారికి నారదుడు చూపి యిప్పుడే ద్విముఖీగోవు ప్రదక్షిణ భూమండల ప్రదక్షిణముతో సమమని శాస్త్రాలు చెబుతున్నాయి. గనుక వెంటనే ప్రదక్షిణ గావించమన్నారు. ఆ ద్విముఖీగోవునకు ప్రదక్షిణము ముమ్మారుజేయగా అంత నారదుడు సంతోసించి గౌతములవారిని వెంటబెట్టుకొని బ్రహ్మవద్దకు వెళ్ళి విషయమంతా చెప్పగా – అంత బ్రహ్మదేవుడు నారదా! యితని ద్విముఖీ గోవు ప్రదక్షిణములు భూమండల ప్రదక్షిణలతో సమానమే. భూమండల ప్రదక్షిణలు అందరికన్నా ముందుగానే ముగించుకొని వచ్చాడు కనుక ఈతనికే అహల్యనిచ్చి వివాహము జేసెదను అని చెప్పి, గౌతములవార్కి అహల్యతో వివాహము జేసెను. యిటువంటి ఫలితములివ్వగల మహాశక్తి గోవులకున్నది గనుకనే ఈ క్షేత్రపీఠాధిపతులైన శ్రీ శివస్వామివారు క్షేత్ర సందర్శకులకు అట్టి శుభఫలితములు పొందవలెనన్న శుభసంకల్పంతో సందర్శకులకు అనువుగా ఒక గోశాల నిర్మించి అందుగోవులను పెంచి పోషించుచుండిరి. యిట్టి ఆర్షసాంప్రదాయానుసారం పెంచిపోషిస్తున్న గోవుల దర్శనం భక్తులయొక్క సకల కార్యములకు శుభప్రదము కనుక యిట్లు శ్లాఘ్యము.

శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ మహాగణపతి దర్శనమ్

విఘ్నేశ్వర దర్శనమ్ – సకల విఘ్ననాశకమ్

కైలాసంలోని శివగణములన్నింటికీ ఈయనే అధిపతి. అందువల్లనే ఈయన గణనాథుడని గణపతియని సార్థకనామధేయుడయ్యాడు. ముల్లోకాల్లోనూ పరమేశ్వరుడు ఈయనకే విఘ్నాధికారం యిచ్చాడు. కనుక ముల్లోకాల్లోనూ యెవరు యే కార్యం తలపెట్టినా అది ఏ ఆటంకములు రాకుండా నెరవేరేటందుకు ఈయననే పూజిస్తారు. విఘ్నాధిపతిగాఉన్న ఈయనను విఘ్నేశ్వరుడని పిలుస్తారు. ఈయనకు పార్వతీపరమేశ్వరులు విశ్వరూప ప్రజాపతి కుమార్తెలయిన సిద్ధి, బుద్ధి యనెడి కన్యలనిచ్చి వివాహము చేసిరి. ఈయనకు సిద్ధివలన క్షేముడు, బుద్ధివలన లాభుడు అను కుమారులు పుట్టినట్లుగా శివపురాణ వచనం. అందువల్లనే ఈ శైవక్షేత్రంలో సిద్ధి, బుద్ధి సమేతముగా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించిరి. శుభప్రదమైన ఈయన దర్శనము వల్ల మానవుడు చేయు సమస్త కార్యములు విఘ్నములు రాకుండగా నిర్విఘ్నముగా నెరవేరుతాయి. కనుక యిట్లు శ్లాఘ్యము.

ప్రధానంగా శ్రీ మహాగణపతి స్వామివారు భార్యాసమేతుడై లాభుడు, క్షేముడు అనే ఇద్దరు కుమారులతో పతిష్ఠించబడి ఉన్నారు. శ్రీ మహాగణపతి ఆశీర్వాదబలంతో శ్రీశైవక్షేత్రంలో భక్తులు జరుపుకొనే అన్నప్రాసన, అక్షరాభ్యాస, నామకరణ కార్యక్రమాలకు ఎటువంటి రుసుములు లేకుండా అర్చకస్వామివార్లను క్షేత్రము వారే ఏర్పాటుచేసి సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన కార్యక్రమం జరుపుకొనువారి తరపున విచ్చేయు 21 మంది భక్త బంధువులకు, అక్షరాభ్యాస కార్యక్రమం తరుపున విచ్చేయు 21 మందికి, నామకరణ కార్యక్రమం తరుపున విచ్చేయు 11 మంది భక్త బంధువులకు భోజనం ఏర్పాటు చేయబడుతుంది. ఈ మూడు కార్యక్రమములు కూడా శ్రీ సిద్ధి-బుద్ధి సమేత మహాగణపతి వార్ల దేవస్థానము నందు జరుపబడతాయి.

నవగ్రహ ఆలయములు

నవగ్రహాలయ దర్శనమ్ స్వగృహాలయ శోభితమ్

ఈ శైవక్షేత్రంలో నవగ్రహాలయములు నిర్మాణమయివున్నవి. ఈ నిర్మాణము మన భారతదేశంలోనే ప్రత్యేకముగా చెప్పవచ్చును. ఆ ప్రత్యేకమేమనగా నవగ్రహములకు ఏ గ్రహమునకు ఆ గ్రహము ప్రత్యేకముగా ఆలయ నిర్మాణములు గావించి అందు ఆయా గ్రహదేవతలను వాహన, ఆయుధ, – భార్యాసమేతముగా ప్రత్యేకముగా ప్రతిష్ఠగావించడమైననది. మరియు అధిదేవత, ప్రత్యధిదేవత, అధిస్థాన దేవతామూర్తులను కూడా ప్రతిష్టించిరి. ప్రతి గ్రహమునకు ఆ గ్రహమునకు సంబంధించిన వృక్షమును, శివలింగాకారములో ఆ గ్రహ రత్నమును కూడా ఏర్పాటు చేసినారు. యిటువంటి నవగ్రహాలయ దర్శనము చేసుకొని, అందలి గ్రహములకు అర్చన, దానాది, పూజాదికములు చేసుకొన్న, మానవుని యఒక్క జాతకరీత్యా, గ్రహచార రీత్యా లేక గోచారరీత్యా ఆయా గ్రహయోగములననుసరించి పట్టి పీడించు గ్రహచార దోషములన్నీ శమించి వారివారి గ్రహములు శోభాయమానముగా ప్రకాశించుచు, గ్రహముల అనుగ్రహము పొందగలరు. భక్తులకు కల్పించిన చక్కటి అవకాశము ఇది. అందుచే భక్తులు విశేషముగా విచ్చేసి అర్చనలు చేసుకొని, గ్రహాల అనుగ్రహాన్ని పొందుతున్నారు. కనుక యిట్లు శ్లాఘ్యము.

నక్షత్ర వనము – దివ్యారామము

హైందవ (హిందూ) ధర్మంలో మనం పూర్వం నుంచి పంచభూతాల పూజలను జరుపుకొంటున్నారు. భూమి నుంచి సమస్తమూ పుడుతున్నాయి. జలము ద్వారా పెరుగుతున్నాయి. అగ్ని ద్వారా లయము అవుతున్నాయి. వాయువు ద్వారా మరగుతున్నాయి. ఆకాశమే సత్యమవుతుంది, అనగా బాహ్య శివస్వరూపాన్ని దాలుస్తుంది. భూమి నుండి ఉద్భవించిన వృక్షజాతులలో అమూల్యమైనవి నక్షత్రవృక్షాలు, వీటిని మన పూర్వ ఋషులు శోధించి మనకు అందించిన విలువైన సంపద, నక్షత్రాలలో ప్రధానంగా ఉన్న 27 నక్షత్రాలలో మనం జన్మించినప్పుడు వాటిలో శాంతిని కలుగజేసేవి కొన్ని, అశాంతిని కలుగజేసేవి మరికొన్ని ఉన్నాయి. నక్షదోషం ఉన్నవారు ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్షానికి జలధారలను (రెండు బిందెల నీరు) అందించి, పూజద్రవ్యములతో ఆ వృక్షాన్ని పూజించాలి. వృక్షసమీపంలో ఆ నక్షత్రం యొక్క మంత్రాన్ని జపము చేసుకొన్నచో దోషపరిహారం జరిగి శాంతిని పొందుతాము. మనోల్లాసానికి, శారీరక, మానసిక, ఆరోగ్యము కొరకై దేవాలయ ప్రాంగణములోను, ఇండ్ల ఆవరణలోను పత్ర, పుష్ప, ఫలాదులను ప్రసాదించు మొక్కలను నాటి పోసించడం మన విధిగా భావించాలి. వృక్షాలు వాతావరణ కాలుష్యముల నుండి మనలను రక్షించడమే కాక, ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలిని మరియు ఫల పుష్పాలను ప్రసాదిస్తాయి. సహజంగానే మొక్కలు, వృక్షాల ఆకులు (కార్బన్-డై-ఆక్సైడ్) బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. అందులో కొన్ని చెట్ల ఆకులు కోసిన 12 గం|| వరకు ఆక్సిజన్ను ఇస్తాయి. ఒక ప్రదేశంలో నిత్యం మానవాళికి ఉపయగపడే భగవంతునికి ప్రతీకలైన చెట్లను నాటితే, అవి వన దేవాలయాలు, దివ్యారామాలు అను పేరుతో పిలువబడతాయి. ఈ నిర్మాణ ప్రాశస్త్యాలు ధర్మశాస్త్రములలో వివరించబడినాయి.

ఒక అశ్వత్థ వృక్షము (రావిచెట్టు), ఒక నింబవృక్షము (వేపచెట్టు), ఒక న్యగోధ వృక్షము (మట్టిచెట్టు), పది చింతవృక్షాలు (చింతచెట్లు), మూడు కపిత్థ వృక్షాలు (వెలగచెట్లు), మూడు బిల్వ వృక్షములు (మారేడు చెట్లు), మూడు అమలకవృక్షాలు (ఉ సిరిచెట్లు), తొమ్మిది ఆమ్లవృక్షాలు (మామిడిచెట్లు)లను వృక్షాలుగా పెంచి పోషించే వ్యక్తి స్వర్గానికే చేరుకుంటాడు. ఈ వృక్షాలను నాటిన ప్రదేశాన్ని ఆరామమని పిలుస్తారు. మరియు శ్రీశైవక్షేత్రములో ఈ వృక్షాలతోపాటు 27 నక్షత్ర వృక్షాలు, రాశివృక్షాలు మరియు నవగ్రహాల అనుగ్రహానికై ఆ గ్రహ సంబంధ వృక్షాలతో మారేడు వనంతో అలరారుతున్న ఈ దివ్యసిద్ధ ఆరామము వలన లభించు స్వచ్ఛమైన గాలి, వృక్షఛాయ, వాని నుండి లభించు పత్ర, పుష్ప, ఫలాలు మానవులకు, పశుపోఆ్యదులకు కూడా నిత్యం ఉపయోగపడతాయి. ప్రతివారు తమ నక్షత్రం యొక్క వృక్షం ఛాయలలో కూర్చొని నక్షత్ర జపాన్నిగానీ, వారి యిష్టదేవతా సహస్రనామార్చన గానీ, గురు ఉపదేశమంత్ర జపాన్నిగానీ చేసినచో మీరు వదిలే కార్బన్-డై-ఆక్సైడ్ను వృక్షము పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ను వదులుతుంది. ఆ ఆక్సిజన్ మీరు పీల్చుకొన్నచో ఆరోగ్యముతోపాటు నక్షత్రదోషం శమించి ఈనుగ్రహాన్నిస్తుంది. కనీసం ఉచ్చ్వాస, నిశ్వాసములను చేసినచో కర్మవిమోచనం జరిగి సంపూర్ణ నక్షత్రదేవత అనుగ్రహం లభిస్తుంది.

పర్ణశాలలు – 4

  1. ధర్మో రక్షతి రక్షితః :- పూజ్యస్వామీజీలు, సాధుసంతులు, సద్గురువులు, భగవత్ బంధువులు మొదలగువారు క్షేత్రానికి విచ్చేసినప్పుడు వారి ధర్మానుష్టానం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పర్ణశాల.
  2. శ్రీ గురుపీఠము :- విశ్వశాంతికోసం లోకకళ్యానార్థం, శివమతస్థాపనార్థం పూజ్య స్వామిజీవారు జపము, ధ్యానము, చేసుకొను పర్ణశాల.
  3. సిద్ద వైద్యకుటీరము :- కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణకోసం సిద్ధవైద్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
  4. ఋత్విక్ పర్ణశాల :– ఋత్విక్ ల వేదపఠనార్థం ఏర్పాటు చేసిన పర్ణశాల.

యాగశాల

క్షేత్రము నందలి ఈ యాగశాల నందు ప్రతినిత్యము అనేక హోమకార్యక్రమములు భక్తులచే జరపబడుతున్నవి. క్షేత్ర వార్షి కార్యక్రమములు మరియు ప్రతిమాసంలో వచ్చే పౌర్ణమి తిథినాడు బాలబాలికల విద్యాభివృద్ధికై మహా సరస్వతీ హోమం క్షేత్ర అర్చక స్వాములచే విశేషముగా జరుపబడును. మరియు ప్రతినెల వచ్చు మాసశివరాత్రి రోజున ఈ యాగశాలలో శ్రీ శివస్వామి వారిచే ప్రారంభించబడిన ‘శివశబ్దతరంగ జపదీక్షా విధానముతో మంత్రోపదేశములు ఉపదేశించబడును.

శ్రీప్రత్యంగిరా దేవి ఆలయము

శ్రీ శివ సంకల్పము నుండి పుట్టిన శివ మానసపుత్రిక ప్రత్యంగిర. పూర్వకల్పాలలో దేవదానవులకు యుద్ధం జరిగినపుడు దేవతలు పరాజయం పొందిరి. అప్పుడు దేవతలందరూ ఆదిపరాశక్తిని వేడుకోలు చేయగా ఆవిడ తన నుండి ఒక శక్తిని పుట్టించి దానవ సంహారం చేయించినది. ఆ శక్తి దేవతలకు అరవైనాలుగు రూపాలలో దర్శనమిచ్చింది. ప్రతిపక్షనాశిని, ప్రతిమంత్ర భక్షిణి అవటం వలన ఆవి ‘ప్రత్యంగిర’ అని. దానవ సంహారం కోసం చేయబడినది కనుక ‘కృత్య’ అని, అధర్వణ మంత్రాలతో అర్చించబడేది కనుక అధర్వణ భద్రకాళి అని, లోన నిలిచి రక్షించేది అనగా (శత్రువులకు ఊపిరి ఆడకుండా చేసేది) కనుక ‘నికుంభిల’ అని పిలవబడుచున్నది.

శివుడు దర్శించిన కృత్య- శివకృత్యగాను, బ్రహ్మదర్శించినది బ్రహ్మకృత్యగాను, విష్ణువు దర్శించినది నారాయణ ప్రత్యంగిరగా పిలవబడింది ఈ దేవి.

ఈవిడే తంత్రగాయత్రిగా, త్రిశక్తి సమన్విత దుర్గగా పూజలు అందుకొంటుంది. జరాసంధుడు ఈవిడను గధాధరిగాను, చినమస్తగాను సిద్ధించుకున్నాడు. ఘంటాకర్ణుడు అనే రాక్షసుడు ఈవిడన ‘చంద్రఘంట’ అనే రూపంలో (నవదుర్గలలో ఈవిడ మూడవది) సిద్దించుకుని ఆవిడ రూపాన్ని కర్ణాభకరణంగా ధరించుకున్నాడు. కనుకనే ఇతనికి ‘ఘంటాకర్ణుడు అని పేరువచ్చింది. తంత్రాలలో అంజనసిద్ధికి ఈవిడే అధిష్ఠానదేవత అని చెప్పబడింది.

మానసదేవి రూపంలో హరిద్వారంలో కొండపైన ఈవిడ పూజలు అందుకొంటుంది. ఈ తల్లి తనను ఉపాసించే సాధకులను వారికి తెలియకుండానే, వారి ఛాయారూపంలో వెంటవుండి కాపాడుతుంది. న్యాయస్థానంలో కళ్ళకు గంతలు కట్టబడి, చేతులో త్రాసు వుండే దేవత ఈవిడే…! అంటే అధర్మాన్ని ఖండించడం, అధర్మాత్ములను దండించడం ఈవిడ చేసే పని. నందుడు ఇంట పుట్టి వసుదేవుని కారాగారానికి చేరి, కంసుడికి 8 భుజాలతో దర్శనమిచ్చిన ‘ప్రత్యంగిర ఈవిడే.

నర్మదానదీ రూపంలోను, యమసోదరి యమునానదీరూపంలోనూ ప్రవహిస్తున్నది ఈ తల్లి. భరద్వాజ మహర్షి ఈవిడ అంశంతో జన్మించాడు. శాక్తేయ దర్శనాల ప్రకారము ఈవిడ మూలధార నివాసిని, అరణ్యవాసం చేసిన శ్రీరాముడు, నలుడు, పాండవులును ఈవిడను ఆరాధించి తిరిగి రాజ్యమును పొందారు. ఈవిడ హృదయానికి ‘అధిష్ఠాత్రి’ అని చెప్పబడినది. రోదసిలో ఈ ప్రత్యంగిర ఒక గ్రహరూపంలో నిలిచిఉన్నదని కొన్ని తంత్ర గ్రంథాలు చెబుతున్నవి.

శనీశ్వరుడు వాడే శంఖం పేరు ‘ప్రత్యంగిర’ అని పిలువబడుతున్నది. విశ్వామిత్రాది ఋషులు ఈ శక్తిని ఉపాసించారు.

ప్రపంచ గ్రంత సముదాయాలలోకెల్ల అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పుకోబడే ఋగ్వేదంలో ఈవిడ మంత్రాలే కనిపిస్తాయి. అందుకనే ప్రత్యంగిరను ఋగ్వేదీయ శక్తి అన్నారు. ఈప్రత్యంగిరా విద్య ప్రధానంగా కేరళ, తమిళ దేశాలలో తాంత్రికులు ఉ పాసించెదరు. ఈవిడ అర్చన, ఆరాధనలు వలన ఏలినాటి శని దోషము తొలగిపోతుంది. హృదయానికి అధిష్ఠాత్రి అవటం వలన, గుండెనొప్పి వచ్చినవారు ఈవిడను ఆరాధించి స్వస్థులుకావచ్చు. అలాగే ఆర్థికమైన లోటు ఉన్నవారు, అప్పులు పాలైనవారు, సంతానంలేనివారు, వివాహం కానివారు మరియు వేద విద్యలో శ్రద్ధఉన్నవారు ఎవరైనా ఈ తల్లిని ఆరాధించవచ్చు.

శ్రీ ప్రత్యంగిరాదేవి 64 కళలకు అధిపతి. ఆమెను దేవతలందరు 64 నామాలతో అర్చించి అనుగ్రహాన్ని సంపాదించారు. ఈ 64 కళలకు ప్రతీకగా ఈ ఆలయ మండపమునందు 64 త్రిశూలములను ప్రతిష్ఠించడం జరిగింది. దిష్టిదోషం, ఈర్ష్య, అసూయద్వేషాలు, చేతబడి, బాణామతి వంటి సమస్త దోషాల పరిహారార్థం శ్రీశైవక్షేత్ర ఉత్తరవాహిణిగాఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి నిమ్మకాలయతో అమ్మను అర్చించి ఆ నిమ్మకాయలను ఈ త్రిశూలములకు అమ్మ 64 నామాలను ఉచ్ఛరిస్తూ గ్రుచ్చాలి. ఈ విధంగా చేసినట్లైతే పైన చెప్పిన సమస్త ప్రయోగ దోషాలు నివృత్తి అవుతాయి.

ఈ తల్లి నిరాకార చైతన్యస్వరూపిని, సాధకులకు అగ్నిశిఖరూపములో దర్శనమిస్తుంది. కాలం ఈ తల్లి ఆధీనం. కాలచక్రం ఈ తల్లి ఆజ్ఞతో నడుస్తుంది. కావున ఈ తల్లి ఆలయ మండపములో కాలచక్రంలో భాగంగా 12 మాసములకు 12 గంటలు ఏర్పాటు చేయటం జరిగింది. 12 రాశుల వాళ్ళు కూడా వారి వారి రాశిఫలాల ప్రకారము ఈ తల్లి సన్నిధిలో సంకల్పము చెప్పుకుని వారి రాశి గంటను మ్రోగించెదరు. శబ్దస్వరూపిణి అయిన ఈ తల్లి ఆలకించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆలయ అర్చకులవారు విచ్చేయు భక్తులకు నిమ్మరసాన్ని తీర్థంగా యిస్తారు. మరియుఅ మ్మవారి ప్రసాదంగా నిమ్మకాయను అర్చనచేసి యిస్తారు. ఈ ఆలయ సన్నిధానంలో ఉన్న యోనికుండములో ప్రతి మాసశివరాత్రి ఉదయం హోమం జరుగుతుంది. ఈ అగ్నిలో భక్తులు మిరపకాయలను అమ్మ అనుగ్రహం కోసం అర్పించి ఆశీర్వాదాన్ని పొందుతారు.

ఋషి సాంప్రదాయంతో, సిద్ధక్షేత్రంగా పార్వతీపరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీ శైవక్షేత్రము నందు వేదోక్త (సాత్విక) విధానంగా వినూత్న రీతిలో ఈ అమ్మని అర్చిస్తూ ఎతోమందికి తమ సంకల్పములను నెరవేరుస్తూ ఒక క్రొత్త ఒకరవడిని సృష్టిస్తుంది ఈ శైవక్షేత్రము.

శ్రీగంగాధర స్వామి – కాలచక్ర శివలింగములు – సర్వం శివమయం

పరమేశ్వరుని అనంత నామాలలో కాలాయనమః, కాలరూపాయనమః, కాలాతీతాయ నమః అంటూ ఆయన్ని కీర్తిస్తారు. సృష్టిలోని ప్రతి పదార్థము శివస్వరూపమే. ప్రధానంగా కాలము పరమేశ్వరుని ఆధీనము, ప్రతిరోజు మనం చేసుకొనే పూజలలో సంకల్పములుగా ఈ కాలాన్ని మనం కల్పాంతరాలు, మన్వంతరాలు, యుగాలు, పాదాలు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, ఆయనాలు, నక్షత్రాలు, తిధులు, కరణాలు, యోగాలుగా కాలాన్ని మనం కొలుస్తాము. ఈ చక్కటి సాంప్రదాయం విశ్వం మొత్తంలో మన భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉంది. అటువంటి ఈ కాలచక్రాన్ని అందరికి దర్శింపచేయాలని శివలింగాల రూపంగా శ్రీ శైవక్షేత్రములో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కాలచక్ర శివలింగాలను దర్శించి, స్పర్శించి, ప్రదక్షణ చేసిన తరువాత మనం ఒక ప్రమాణం చేయాలి. నేను నా జీవత ప్రయాణంలో సత్యాన్ని పలుకుతానని, ధర్మాన్ని పాటిస్తానని, కాలచక్ర శివలింగాల సాక్షిగా అక్కడ ఏర్పాటు చేయబడిన సత్యధర్మ గంటలను మ్రోగించవలెను.

శివకోటి స్థూపము – సహస్రకోటి నామ లిఖిత యజ్ఞము

ఓంకారం ప్రణవం వందే ఓం కారం పరమాత్మకం |
ఓం కారం శివరూపంచ – శివజ్ఞాన పరేతరా॥

“ఓమ్”కార నామము ఇది పరమాత్మ యొక్క ముఖ్య నామము. ఋషులు, యోగులు, మునులు, జ్ఞానులు ఈ ఓంకారమును నిరంతరము జపించి తరించి ముక్తిని పొందారు. ఈ ఓంకార నామాన్ని పండితులు, పామరులు మాటలురాని మూగవారు సైతము జపించవచ్చు మరియు లిఖించవచ్చు. మూగజీవులైన ఆవులు అరచు “అంబా” అను శబ్దములో కూడా ఓంకారము ధ్వనిస్తుంది. సమస్త మానవులు సృష్టారంభము నుండి ఓంకారమును స్మరించెడివారని చరిత్ర చెప్పిన సాక్ష్యం. భగవంతుడు ఒక్కడే అని అతనికి శతసహస్రనామములు గలవని శాస్త్రాలు చెబుతున్నవి. కాని ఆ పరమాత్ముని యొక్క ముఖ్య నామము ఓంకారమే. సహస్రకోటి ఓంకార నామాన్ని లిఖించి ఆంధ్రదేశములోని అన్ని మండల కేంద్రాలలో సహస్ర (1116)శివకోటి స్థూపాలను ఏర్పరచి భక్తులకు శివకోటిస్థూప ప్రదక్షణ ద్వారా ఓంకార స్వరూపుడైన పరమేశ్వరున్ని కోటిసార్లు ప్రదక్షణ చేసిన భాగ్యాన్ని కలుగజేయాలని పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామివారి సంకల్పము. భక్తులందరూ కూడా ఓం నామ లిఖిత పుస్తకములను స్వీకరించి లిఖించి మీ నామధేయమును, గోత్రమును, చిరునామాను లిఖించి క్షేత్ర కార్యాలయములో అందజేయవచ్చు

పంచలింగములు – మారుడువనం – శివానుగ్రహం

బిల్వవృక్షము వృక్షజాతులలో రారాజుగా పిలవబడుతున్నది. బిల్వవృక్షము శంకర స్వరూపమని దేవతలు వర్ణించుచుందురు. బిల్వవృక్షముల ప్రదేశమునందు పదునాలుగు లోకముల యందలి పుణ్యతీర్ధములు నివసించునని ఋషులు వక్కాణించినారు. బిల్వవృక్షముదగు మూలప్రదేశము నందు లింగస్వరూప శివుని పూజించు పుణ్యాత్ముడు శివలోకము జెందును. బిల్వమూలదగు మృత్తికా జలముతో స్నానము చేయువాడు గంగా, గోదావరి, సరస్వతి తీర్ధములయందు స్నానములు చేసిన పుణ్యము పొంది పావనుడు అగును. బిల్వవృక్షము చుట్టూను దీపముల పంక్తి నేర్పరచువాడు శిశతత్త్వజ్ఞానము గలవాడై ముక్తుడగును. బిల్వమూలమునందొక శివభక్తునికి భోజనము నొసగునట్టి పుణ్యాత్ముడు కోటి జనులకు అన్నదానము చేసిన ఫలమొందును. శివునికి అత్యంత ప్రీతిదాయకమైనది బిల్వ పూజ. బిల్వ వృక్షము క్రింద కూర్చొని మంత్రజప సాధన చేసిన యెడల తొందరగా సిద్దించునని శాస్త్రములు విశదీకరించినవి. దేవతలు, ఋషులు మహాదేవుని బిల్వ పమ్రులతో పూజించి కామ్యసిద్ధిని బడసిరని పురాణములు వర్ణించినవి. అటువంటి బిల్వ (మారేడు) వనములో సాధకులకు అనువుగా వారి సాధన పరిపూర్ణతకు శ్రీ భక్త లింగేశ్వరస్వామి, శ్రీ జ్ఞానలింగేశ్వరస్వామి, శ్రీ ధ్యానలింగేశ్వరస్వామి, శ్రీ యోగ లింగేశ్వరస్వామి, శ్రీ మోక్షలింగేశ్వరస్వామి వార్లగా పంచశివలింగములు ప్రతిష్ఠ చేయబడినవి. (పంచలింగాల దర్శన పంచకర్మనాశనం) శివశబ్దతరంగ మార్గ మంత్ర దీక్షా పరులకు ఈ వనం శివానుగ్రహం.

శ్రీశైవక్షేత్రములో యుగధర్మలింగాలు – విశిష్టత

కృతయుగము పాదరస లింగార్చన (మోక్షలింగము)

కృతయుగంలో రసలింగార్చన చేసేవారు. పశ్చిమాన సోమనాథ్, ఉత్తరాన కేదార్నాథ్, దక్షిణాదిన రామేశ్వరాది ద్వాదశ జ్యోతిర్లింగములతోపాటు భూమి మీద ఇతర శివలింగములను సందర్శించుట ఎంత పుణ్యదాయకమో అంతే పుణ్యప్రాప్తి రసలింగ దర్శనం వల్ల మాత్రమే లభించును. వేలాది బ్రహ్మహత్యా పాతకాలు, వందలాది గోహత్యా పాతకాలు, రసలింగ దర్శనంతో క్షణకాలంలో నివరణకాగలవు. శిలామృత్తికలతో నిర్మింపబడిన శివలింగముకంటే స్వర్ణలింగము కోటిరెట్లు పుణ్యప్రదం. స్వర్ణం కంటే మణులచే నిర్మింపబడిన రత్నలింగము కోటిరెట్లు, దానికన్నా నర్మదానదీ తీరంలో లభించే బాణలింగము కోటిరెట్లు శ్రేష్ఠం. బాణలింగము కంటే కోటిరెట్లు పుణ్యప్రదం పాదరసంతో తయారుచేసబడిన రసలింగ దర్శనం. ఈ రసలింగాన్ని పూజ్య స్వామిజీవారు, వారి సోదర సమానులైన శ్రీ చావలి హనుమకుమార్ (పసి) గారు తమ స్వహస్తములచే తయారు చేసినారు. అనేక రకాల మూలికలతో పాదరసాన్ని శుద్ధిచేసి మంత్రపూర్వకంగా ఘనీభవింపచేయడం జరిగింది. ఈ రసలింగాన్ని మొదట అర్చన చేసేటప్పుడు స్వామిజీ ఒక విషయాన్ని తెలియపరిచారు. ఈ రోజు ప్రదోషకాలంలో ఆకాశంలో అధ్యద్భుత శివలింగ దర్శనం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరకూ తెలియపరచండి. పరమేశ్వరుని దర్శన భాగాన్ని అందరికీ కలిగించండి అని చెప్పారు. గ్రామముల నుంచి కొన్ని వేల మంది భక్తులు విచ్చేసి ఆకాశంలో అత్యద్భుత రసలింగ ప్రతిబింబాన్ని దర్శించి జన్మలు తరింపచేసుకొన్నారు. ఈ రసలింగ దర్శనంతోనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ శివలింగ దర్శనం అద్భుతం … పరమాద్భుతం.

రసలింగేశ్వదర్శనమ్ అత్యద్భుత దర్శనమ్

ఈ రసలింగేశ్వర దర్శనము మానవునకు నిజముగా అత్యద్భుత దర్శనమే. కారణమేమనగా ప్రపంచ దేశాల్లో యెక్కడా కూడా యింత పెద్ద పరిమాణం కలిగిన నిష్కళ పాదరసలింగం లేదని రసలింగ సందర్శకులెందరో అభివర్నించారు. పాదరసమనగా ఈశ్వర వీర్యము. యిది మహాశక్తివంతమయినది. మహా మహిమాన్వితమయినది. కనుక దీనిని లింగరూపంలో ఘనీభవింప జేయడానికి యెవరూ సాహసించరు. అలా చేయాలంటే పరిపూర్ణ శివకటాక్ష సంపన్నులు నిరంతర పంచాక్షరీ మహామంత్రధురీణులు – పరమేశ్వరుని యందు అచంచల యేకాగ్రతాదృష్టి పరిపూర్ణ భక్తి విశ్వాసాలు- నిస్వార్థ భగవత్సేవ పరాయణులకే ఆ రససిద్ధి లభ్యమవుతుంది. స్వార్థ ప్రయోజనాలకు దీనిని ఘనీభవింపజూచిన వారికి యిది చేటు కల్గిస్తుంది. కనుక యెటువంటి స్వార్థ చింతనలేకుండగా నిస్వార్ధ బుద్ధితో హృదయము భగవదార్పణము గావించి ప్రయత్నించిన వార్కి మాత్రమే రసయోగం సిద్దించి శివానుగ్రహంతో లింగరూపంగా ఘనీభవించుట సాధ్యమవుతుంది. రసయోగంలో కళ- నిష్కళ అని రెండు పద్దతులలో పాదరసమును ఘనీభవింపజేయవచ్చునని రసవాదగ్రంధములు చెప్పుచున్నవి. యిందు కళాపద్ధతి అనగా లోహ సంబంధముతో ఘనీభవింపజేయుట, రెండవది వనమూలికా ప్రభావంతో ఘనీభవింపజేయుట. యిందు నిష్కళ మూలికా ప్రభావంతో ఘనీభవింపజేసినదే శ్రేష్ఠమయినదని రసవాదం చెబుతోంది. యిలా ఘనీభవింపజేసిన రసలింగం యొక్క అభిషేకజలం కూడా యెంతో శ్రేష్ఠమయినదిగా పరిగణింపబడినది. యిలా నిష్కళా పద్ధతిలో తయారు చేయబడిన రసలింగ ప్రభావం యెటువంటిదంటే అంగుష్ట ప్రమాణం (అనగా బొటనవ్రేలంత) కల్గిన రసలింగ దర్శనం చేసుకున్నంత మాత్రాన ముల్లోకాల్లోయున్న శివలింగములన్నీ దర్శించిన ఫలము మానవుడు పొందుతున్నట్లు రసవాదగ్రంధాలు చెబుతున్నాయి. శ్రీ శైవక్షేత్రము నందలి రసలింగము బహుప్రమాణం కలిగి ఉన్నది. మరి బొటనవ్రేలంత ప్రమాణం కల్గిన రసలింగమునకు అంత ప్రభావమున్నప్పుడు శ్రీ శైవక్షేత్రమునందలి రసలింగ దర్శనం వలన యింకెంత ప్రభావము కల్గునో యెంతటి మహామాన్వితమైన శక్తి కల్గునో కదా! శ్రీ శైవక్షేత్రం నందు నిష్కళ పద్ధతిలో తయారు చేయబడిన ఈ పాదరసలింగం ప్రపంచ దేశాల్లో పెద్దది కనుక ఆ దర్శనం భక్తులకు నిజంగా అత్యద్భుతమే.

రసలింగేశ్వర దర్శనమ్ – సకల దేవతల దర్శనమ్

యిట్టి అత్యద్భుత ప్రభావముతో ప్రకాశిస్తూ విరాజిల్లుతున్న రసలింగదర్శనము చేస్తే సకల దేవతల దర్శనం చేసుకున్న ఫలము మానవుడు పొందుతున్నాడు.

రసలింగేశ్వర దర్శనమ్ – అష్టభోగదాయకమ్

అంతేగాక యిట్టి శక్తివంతమైన రసలిందర్శనము చేసుకొన్న మానవుడు జీవితంలో అష్టభోగములను పొందుతారు. అష్టభోగములనగా 8 భోగములు- అవి; గృహము శయ్య – వస్త్రము ఆభరణము స్త్రీ పుష్పము – గంధము. తాంబూలము. యివి అష్ట భోగములు.

రసలింగేశ్వర దర్శనమ్ – భవబంధ విమోచనమ్ |

ఈ రసలింగదర్శనము వలన మానవుడు భవబంధములు నుండి విముక్తుడగును.

రసలింగేశ్వర దర్శనమ్ – శుద్ధ మోక్షఫలప్రదమ్ |

శుద్ధమైన నిర్మలమయిన మనస్సుతో ఈ రస లింగదర్శనం చేసుకొన్న మానవుడు మోక్ష సోపానమునకు అర్హుడై యుంటాడు. రసలింగ దర్శనం వల్ల, అర్చనల వలన మానవుడు ఆశ్చర్యదాయకమైన అద్భుత అనుభూతిని పొందగలుగుతాడని రసవాద గ్రంధాలు చెబుతున్నాయి. శరీరంతో భూమి మీద బ్రతికియున్న మానవునకు మోక్షము అంటే యేమిటో అది యెట్లుండునో శరీర ధారియైన మానవుడు ఏ మాత్రం చెప్పలేడు. కాని రసలింగ దర్శనం వలన, అర్చన వలన మానవుడు శరీరంతో సజీవుడై భూమిపై యున్నప్పుడే రసలింగార్చనా ప్రభావాల వల్లను, రసలింగ దర్శన ప్రభావం వల్లనూ అద్భుతానుభూతులు పొందడమేగాక సజీవుడైన శరీరధారికి దుర్లభమయిన మోక్షానుభూతిని సహితం తెలుసుకొని అనుభవించి, దాని పూర్వాపరాలను గ్రహించి, అవగతము చేసుకొనగల్గిన శక్తి. ప్రభావము ఒక్క రసలింగార్చనాపరులకు మాత్రమే సాధ్యమని రసవాద గ్రంధాలు చెబుతున్నాయి. కనుక రసలింగ దర్శనమ్ మానవునకు శుభం మోక్షదాయకముగా శ్లాఘ్యమై యున్నది.

త్రేతాయుగము – రత్నలింగార్చన (అమృతలింగము)

త్రేతాయుగంలో అందరూ రత్నలింగార్చన చేసేవారు. స్థితికారకుడైన శ్రీమన్నారాయణమూర్తి ఇంద్రనీలమణితో చేసిన శివలింగానికి అర్చనాభిషేకములు చేసేవారు. తాను చేయుటమే కాకుండా వివిధ దేవతలకు విశ్వకర్మచే వారి వారి అర్హతలను బట్టి వివిధములైన లోహములతో అనేక రకాల మణులతో శివలింగాలను తయారు చేయించి పార్వతీపరమేశ్వరుల స్వరూపమైన ఈ శివలింగాలను ప్రతి నిత్యము అర్చనాభిషేకాలు చేసుకొనే అవకాశాలను కల్పించారు. శ్రీశైవక్షేత్రమునందు ప్రతిష్ఠితమైన ఈ రత్న లింగమే అమృతలింగముగా చెప్పబడుతుంది. పూర్వము ఆయుర్వేద సిద్ధ వైద్యులువ ఇవిధ రత్నముల భస్మముతో రోగులకు వైద్యము చేసి దీర్ఘకాలికముగా ఉన్న రోగాలను సమూలంగా తొలగించేవారు. ఇటువంటి రత్నలింగానికి అభిషేకము చేసిన తీర్థాన్ని స్వీకరరించినట్లైతే ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించు ననుటలో ఎటువంటి సందేహము లేదు. పూజ్యస్వామీజీవారు రత్నలింగాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పతో 5 రోజులు ధ్యానంలో గడిపి ఆ పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాదంతో క్షేత్ర పండితులను తీసుకుని ఉత్తరదేశానికి బయలుదేరారు. అక్కడ ఒక చోట బస చేసి మరల ధ్యానం చేసి 8 కిలోమీటర్ల దూరం నడచి ఒక ఇంటి తలుపు తట్టగా ఒక ముస్లిం బయటకు వచ్చి ఏమిటి అన్ని ప్రశ్నించగా స్వామివారు నీ దగ్గర వున్న రత్నాన్ని ఇవ్వవయ్యా! అని అడుగగా ఆ ముస్లిం ఎంతో ఆనందంతో ఆ రత్నాన్ని శిరస్సున ధరించి మిఠాయిలు పంచి స్వామీజీవారికి ఇవ్వటం జరిగింది. తరువాత ఈ రత్నాన్ని శివలింగముగా మలచటానికి జరిగిన ప్రయత్నంలో ఒక మార్వాడి వర్తకుని కలిసి ఆ రత్నాన్ని శివలింగంగా మలచమని చెప్పగా ఆయన ఈ రత్నశిలను శివలింగంగా తయారు చేయటానికి 3,50,000 మజూరు అవుతుందని తెలియపరిచారు. వారితో మాట్లాడుతుండగా మధ్యలో ఫోను మ్రోగింది. ఉత్తరప్రదేశ్ నుండి ఆర్డర్ ఇచ్చిన స్పటిక లింగం తయారు అయినదని మీరు బయలుదేరి వచ్చి తీసుకెళ్లమని శేటుగారు ఫోన్లో అవతలవారికి విషయాన్ని చెప్పి ముగించారు. అక్కడ ఉన్న మన స్వామీజీవారు అయ్యా శేటుగారు ఆ స్పటికలింగాన్ని వారు తీసుకెళ్ళలేరు అని చెప్పగా, ఆయన మీరు భలేవారు స్వామీ! వాళ్ళు ఈ రోజే బయలుదేరి వస్తున్నారు అని చెప్పగా మన స్వామీజీవారు చిరునవ్వు నవ్వి వాళ్ళు ఆ లింగాకారాన్ని తీసుకుని వెళ్లలేరు, కావాలంటే మీకు 20 రోజులు సమయమిస్తున్నాను ఆ స్పటికలింగం వాళ్ళు తీసుకుని వెళితే మీరు అడిగినట్లుగా 3,50,000 రూ॥ మజూరు పూర్తిగా మీ సొంతం. లేకపోతే ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా మీచే తయారు చేయబడిన ఆ శివలింగాన్ని మాకు యివ్వాలి యిది ఒప్పందం. ఆ శేటుగారు దానికి సరే అని చెప్పగా స్వామివారు, పండితులు తిరుగు ప్రయాణం అయి క్షేత్రానికి వచ్చినారు. ఈ జరిగిన విషయాన్ని పండితులు క్షేత్రంలోని వారందరికీ తెలియబరచగా అందరూ 20 రోజుల తరువాత ఏం జరుగుతున్నదో అని ఆత్రుతగా ఎదురు చూడటం జరిగింది. 18 రోజులు గడిచిన పిదప స్వామిజీ వారు ఆశ్రమవాసులను సమావేశపరిచి ఈ రోజు రాత్రికి నేను మరియు క్షేత్ర పండితులు ఉత్తరదేశానికి వెళు తున్నాము. బహు చక్కగా మలచిన రత్నలింగాన్ని తీసుకు వస్తాము అని చెప్పి ప్రయాణ చార్జీల నిమిత్తం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే మేనేజరు గారి దగ్గర తీసుకుని ప్రయాణం అయ్యారు. క్షేత్రపండితులకు ఏమీ అర్ధం కావడంలేదు. అక్కడ కట్టవలసినది 3,50,000 రూ||లు మరి మనం సొమ్ము తీసుకుని వెళ్ళటంలేదు. ఎలా? మరి పరమేశ్వరుని మీద భారం వేసి ప్రయాణం అయ్యారు. 20వ రోజున అందరు ఆ శేటుగారి వద్దకు వెళ్ళగా ఆ శేటుగారు చాలా ఆశ్చర్యంతో ఎదురు వచ్చి స్వామిజీ వారికి నమస్కరించి స్వామీ మీరు చెప్పినట్లే ఆర్డరు యిచ్చిన వాళ్ళు వచ్చి ఆ శివలింగాన్ని తీసుకుని వెళ్ళలేదు. కావున మాట ప్రకారం ఇదిగోండి మీ రత్నలింగం మీకు అప్పచెబుతున్నాను. అని అందచేయగా వెంట వున్న అంతా ఆశ్చర్యపోయినారు ఆనందంతో వాళ్ళకు మాటలు రాలేదు. ఎటువంటి ఖర్చులేకుండా ఉత్తరదేశం నుండి దక్షిణ దేశానికి పరమేశ్వరుడు విచ్చేసి ఇక్కడ ప్రతిష్టించబడి అమృతలింగంగా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న అద్భుత లింగం ఈ రత్నలింగం.

ద్వాపరయుగము – స్ఫటికలింగార్చన (జీవన్ముక్తి లింగము)

ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ స్పటికలింగార్చన చేసేవారు. శుద్ధ స్ఫటిక లింగాన్ని అందరూ పూజించవచ్చును. ఏకాంగళ నుంచి ఏ పరిమాణంలో ఉన్న శివలింగాన్నయినా మన గృహములలో కూడా పూజా పీఠమునందు చరలింగముగా ప్రతిష్ఠించుకొని పూజించుకొనవచ్చును. స్పటిక లింగ దర్శనము చేస్తూ చేయు జపము, ధ్యానము అనంత ఫలితాన్నిస్తాయి. మానసిక ఇబ్బందులైన గురైన వారు ఈ స్పటిక లింగ దర్శనంతో స్వస్థత పొందవచ్చును. స్పటిక లింగ అభిషేక జలం మనస్సుకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. శుద్ధ స్ఫటిక లింగార్చన వలన జీవన్ముక్తి లభిస్తుంది. సర్వ వర్ణస్తులు, పెద్దలు, పుణ్యస్త్రీలు, వితంతువులు అందరూ స్పటికలింగార్చన చేసుకోవచ్చును. ఇదే జీవన్ముక్తి లింగము.

స్ఫటిక లింగదర్శనమ్ విశ్వదర్శనమ్

అటువంటి ఈ స్ఫటిక లింగము పానపట్టముతో సహా శుద్ధ స్ఫటికముతో శ్రీశైవక్షేత్రమునందు ప్రతిష్ఠ గావింపబడినది. ఈ స్పటిక లింగదర్శనం వల్ల సర్వ విశ్వాన్ని దర్శించిన ఫలాన్ని పొందవచ్చును.

కలియుగము – పంచలోహలింగార్చన (సంకల్ప లింగము)

‘శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తిః’ । శివుని కరుణచేతనే జ్ఞానము ఉదయించును. “జ్ఞానమిచ్ఛేన్న మహేశ్వరాత్”. పరమశివుని నుండియే జ్ఞానము సముపార్జించవలెను. “సదాశివ?” ఆత్మయే శివుడు. “ఈశానస్సర్వ విద్యానాం” సమస్త విద్యలకు పరమశివుడే అధిపతి అని వేదములు తెలుపుచున్నవి. ‘ఓంకారము’ నుండి ‘నమఃశివాయ’ అనెడి పంచాక్షరి ఆవిర్భవించెను. ఈ పంచాక్షరి నుండి పంచభూతములు ఆవిర్భవించెను. అవియే పృధ్వి వ్యాప్తేజోవాయురాకాశములు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము) ఈ పంచభూతములు పంచీకరణ చెందుట ద్వారా సకల ప్రపంచము ఆవిర్భవించెను. ఈ పంచభూత స్వరూపములు పంచలోహేశ్వరుడిగా శ్రీ శైవక్షేత్రము నందు సంకల్పలింగముగా పూజలందుకుంటూ సమస్త మానవాళికి శుభాలను చేకూరుస్తూ అందరి సంకల్పాలను నెరవేరుస్తూ నిత్యము అర్చనాభిషేకములతో అందరినీ అనుగ్రహిస్తున్న సంకల్ప లింగము ఈ పంచలోహ లింగము.

పంచలోహ లింగారాధన చేయండి-పంచభూతాల అనుగ్రహాన్ని పొందండి

ఈ పంచలోహేశ్వరుడు కూడా మనదేశంలో చాలా విశిష్టమయిన మహేశ్వరుడు. పంచలోహములతో అనగా బంగారము -వెండి – రాగి -ఇత్తడి – ఇనుము యివి పంచలోహములు. ఈ లోహాదులను మేళవింపజేసి తయారు చేయబడిన విశిష్టమయిన లింగమూర్తి ఈ పంచలోహేశ్వరుడు. పంచలోహ నిర్మితమయిన కారణంగా ఈ స్వామి పంచలోహేశ్వరుడుగా పిలువబడుచున్నాడు. మానవుడు తనకు తెలియకనే ఆప్రయత్నముగా పంచసూనపాపములు ప్రతినిత్యము జేయుచున్నాడు. పంచసూనపాపములనగా 1) భుర్లే దోషము 2) పౌషణీ దోషము 3) ఖండినీ దోషము 4) ఉదకుంభదోషము 5) మార్జనీ దోషము. యివి పంచసూన పాపములు. ఇందు మొదటిది భుర్లేదోషమనగా మనము పొయ్యిలో మంట పెట్టుటకు కట్టెలు నుయోగింతుము. ఆ సమయమందు ఆయా కట్టెలనాశ్రయించి వున్న క్రిమికీటకాది జీవులు చాలా నశించుచున్నవి. దీనిని భుర్లే దోషమందురు. యిక రెండవది పౌషణి దోషము. అనగా పప్పులు దంచుటకు రోలు రొకలి ఉపయోగింతుము. ఆ సమయములో మన కంటికి కనబడని కొన్ని సూక్ష్మజీవులు ఆ దంపుడులోబడి నశించుచున్నవి. యిది ఫౌషణీ దోషము. యిక మూడవది ఖండినీ దోషము. మనకు ఆహారముగా

రకరకములయిన కందమూలాదులు (కూరగాయలు) కత్తిపీటతో కోయుదుము లేక ఖండింతుము. ఆ సమయమున ఆ కూరల నాశ్రయించియున్న సూక్ష్మజీవులు కూడా ఖండింపబడుచున్నవి. యిది బండినీ దోషము. యిక నాల్గవది ఉదకుంభ దోషము. అనగా మనము వంటపాత్రలు వగైరాలు కడుగు సమయంలో గాని లేదా మనకు నీళ్ళు అవసరమయినప్పుడు దగ్గర ఉన్న ఏదైనా పాత్రను ముందుగా శుభ్రపరచుకొనుటకు (పాత్రలో కొంచెనీళ్ళు పోసి కడిగి క్రింద గుమ్మరించుతాము) ఆ నీటి ప్రవాహమునకు అక్కడనున్న కొన్ని క్రిమికీటకాదులు ప్రవాహవేగములో కొట్టుకు పోతుంటాయి. యిది ఉదకుంభ దోషము. యిక అయిదవది మార్జనీ దోషము. మనము నివసించెడు నేలను పూర్వకాలంలో ఆవుపేడతో అలికేవాళ్ళు. ఆవు పేడతో అలుకు సమయంలో భూమిపై నున్న కొన్ని క్రిమికీటకాదులు నశించును. దీనిని మార్జనీ దోషము అందురు. ఈ అయిదు దోషములకు పంచసూన పాపములని పేరు. వీటిని మానవుడు నిత్యము చేయును. యివి చేయనిదే మానవుని ప్రొద్దు గడవదు. యివి ఆ ప్రయత్నముగా చేసెడి దోషములు. వీటి నుండి మానవుడు తప్పించుకొనుటకు మహర్షులు పంచమహాయజ్ఞములు నిర్ణయించి, వీటిని మానవులచే ఆచరింపజేసి, పంచసూన పాప సంబంధ దోషములను విముక్తులనుగా జేసిరి. ప్రస్తుత కాలంలో యిట్టి పంచమహాయజ్ఞములు మానవుడాచరించుట దుర్లభము. కానీ పంచసూన పాపములు చేయక తప్పదు. యిట్టి సమయంలో భక్తిపూర్వక విశ్వాసంతో పంచలోహేశ్వరుని దర్శించినవారు పంచమహాయజ్ఞములాచరించు ఫలితమును పొంది పంచసూన పాపముల నుండి విముక్తులగుదురు. కనుక పంచలోహేశ్వర దర్శనము పంచమహాపాతనాశనమ్ యిట్లు శ్లాఘ్యము.

భూకైలాసము – కైలాసము మహాకైలాసము

శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము

శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీకోటిలింగేశ్వర స్వామివార్ల దేవస్థానము

శ్రీ కోటిలింగ మహాశైవవక్షేత్రము నందు ప్రధాన ఆలయముగా నిర్మాణము చేయబడి ‘శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి’ వార్ల ప్రతిష్ఠతతో సంపూర్ణము సిద్ధించుకున్న ఈ ఆలయము మూడు యోగములకు నిలయము.

కైలాసం – భక్తిమార్గము – కర్మమార్గము

శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల దేవస్థానము

శ్లో || ఏక ఏక శివః సాక్షాత్ సత్యజ్ఞానాది లక్షణః |
వికారరహితః శుద్ధః స్వశక్త్యా పంచధాస్థితః ॥

తాత్పర్యం : సత్యజ్ఞానానంద స్వరూపుడు, వికారరహితుడు అగు పరమశివుడు ఒక్కడే. సృష్టి స్థితి, లయ, తిరోధాన

అనుగ్రహములు అను పంచకృత్యశక్తుల వలన ఆ పరమశివుడే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అను ఐదు భేదములచే ఒప్పుచున్నాడు. ఇందు ఈశానుడు- ప్రకృతిభోక్త యగు క్షేత్రజ్ఞ (జీవాత్మ) సధిష్ఠించి శ్రోత్రము, వాక్కు శబ్దము, ఆకాశము, అను వాని పైనధికారము గలిగియుండును. తత్పురుషుడు గుణాశ్రయము భోగ్యంబునకు అవ్యక్తము (ప్రకృతి) నధిష్ఠించి చర్మ, హస్తములు, స్పర్శ, వాయువు, అను వానిపై అధికారము గలిగి యుండును. అఘోరుడు – ధర్మాది అష్టాంగయుక్తమగు బుద్ధి నదిష్ఠించి నేత్రములు, పాదములు, రూపము, అగ్నియను వానిపై అధికారము గలిగి యుండును. వామదేవుడు – అహంకారము అధిష్టించి నాలుక, గుహ్యము, రసము, ఉదకములు, అనువానిపై అధికారము గలిగి యుండును. సద్యోజాతుడు – మనస్సు అధిస్టించి ముక్కు, ఉపస్థము, గంధము, భూమి అనువానిపై అధికారము గలిగి యుండును. 1) సద్యోజాత ముఖము నుండి గాయత్రి మొదలగు రెండుకోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీనిని ‘వైదిక మంత్రములు’ అందురు. ఇవియే పూర్వమ్నాయ మంత్రములు అనబడును. 2) వామదేవ ముఖము నుండి శైవాగమము చెందిన మంత్రములు ఒక కోటి జనించినవి. ఇవి దక్షిణామూర్తి ఇత్యాది మంత్రములు. వీనిని దక్షిణామ్నాయ మంత్రములు అందరు. 3) అఘోర ముఖము  

నుండి వైష్ణవ ఆగమోక్తములైన ఒకకోటి మంత్రములు వెలువడినవి. ఇవి పశ్చిమామ్నాయ మంత్రుములుగా వ్యవహరించబడినవి. 4) తత్పురుష ముఖము నుండి రెండుకోట్ల మంత్రములు ఉద్భవించినవి. మహా విద్యాది మంత్రములు ఇవియే. ఇవి ఉతరామ్నాయ మంత్రములుగా పేర్కొనబడినవి. 5) ఈశాన ముఖము నుండి ఆత్మానంద ప్రదములైన కోటి మంత్రములు ఉ ద్భవించినవి. వీనిని ఊర్ధ్వమ్నాయ మంత్రములుగా వ్యవహరించెదరు. ఈ విధముగా మొత్తము సప్తకోటి మహామంత్రములు పరమేశ్వరుని పంచముఖముల నుంచి ఉద్భవించినవి. ఇట్టి సద్యోజాతాది పంచ బ్రహ్మమూర్తుల పంచముఖములతో శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీకోటి లింగేశ్వర స్వామి వారుగా కొలువై ఉన్నారు. మహాకాల గోపతి నంది- భృంగి- ముండి -దండి – విజయ- అనంతలనెడి అష్టద్వార పాలకులతో, సప్తధ్వజ స్తంభములతో, నంది పంచములతో శ్రీ కోటిలింగేశ్వరస్వామి ప్రతిష్ఠుతులై ఉన్నారు. శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి క్షేత్ర పాలకుడుగా శ్రీ వీరభద్రస్వామి మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి క్షేత్రపాలకుడుగా – శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి వారు ప్రతిష్ఠితులై ఉన్నారు. ఈ ప్రాంగణములోనే శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ప్రతిష్ఠితులై ఉన్నారు. వీరికి క్షేత్రపాలకునిగా కాల భైరవ స్వామి ప్రతిష్ఠించబడి ఉన్నారు. భారతదేశములోనే ప్రప్రథముగా సప్తధ్వజములతో శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వరస్వామి వారి సన్నిధిలో ద్వాదశ జ్యోతిర్లింగములు ప్రతిష్ఠించబడి ఉన్నవి..

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్

శ్లో || ఉజ్జయిన్యాం మహాకాల మోంకారే పరమేశ్వరమ్ ||
సౌరాష్ట్ర సోమనాథంచ – శ్రీ శైలే మల్లికార్జునం |
వారాణస్యాంచ విశ్వేశం – త్ర్యంబకం గౌతమీతటే ||
వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే |
సేతేబంధే చ రామేశం – ఘుశ్వేశం చ శివాలయే ॥
కేదారం హిమవత్ పృష్టే దాకిన్యాం భీమశంకరం |

సోమనాథుడు మొదలుకొని ఘుశ్మేశ్వరుని వరకు గల పండ్రెండు జ్యోతిర్లింగముల నామధేయముల నుదయమున చదువువాడు పాపములన్నింటిని పోగొట్టుకొనుటయే గాక జీవిత సమయమున కృతార్థుడగును, మరియు నంత్యకాలమున ముక్తుడగును. మానవులలో నుత్తములగువారు నీ స్తోత్రమును చదివినిచో ఇహలోకమున కోరికలు సిద్ధించుటయేగాక పరలోకమున ఇంద్రభోగాది సుఖములు చేకూరును. చిత్తశుద్ధితో నిష్కామబుద్ధిని పఠించు వారికి తల్లికడుపులో నివాసము సంభవింపదు. ఐతే వీనిని స్మరించుటతోడనే తృప్తి పడక ఈ జ్యోతిర్లింగములను దర్శించి భక్తితో పూజించిన యెడల నీ లోకమున పలుకుబడి హెచ్చుటయే గాక పరమపదమున శివసాయుజ్యము నొందగలగుదురు.

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నీ జ్యోతిర్లింగములను పూజింపవచ్చును.

ద్వాదశ జ్యోతిర్లింగముల ప్రసాదమును తీర్ధమును పరిగ్రహించువారి దురితములన్నియు తక్షణము పటాపంచలగుననుటయే పరమార్ధమని తెలియవలెను. జ్యోతిర్లింగ తీర్థప్రసాద స్వీకార ఫలమును బ్రహ్మాది దేవతలే నిరూపింపజాలనపుడు మానవులైతే ఎంతమాత్రము చెప్పజాలరని విశదమగుచున్నది.

ఐతే ఈ పండ్రెండు జ్యోతిర్లింగములను దర్శింపనవకాశము లేనివారు కనీసము ఒక్క లింగమునైన నారుమాసములు నిత్యము పూజించునెడల నవ్వారికి మాతృగర్భ నివాసము తప్పును. అనగా జన్మరాహిత్య మొదవునని భావము.

నీచజన్మ నొందినవాడు సయితము జ్యోతిర్లింగమును చూచినచో పరిశుద్ధ వంశమున జన్మించి వేదశాస్త్ర పరిజ్ఞానము కలిగి ధనాడ్యుడై సుకృతముల నీశ్వరార్పణబుద్ధి నాచరించియు శివానుగ్రహమున ముక్తుడగును. మ్లేచ్చుడు కాని అంత్యజుడు కాని నపుంసకుడు కాని జ్యోతిర్లింగమును దర్శించునెడల బ్రాహ్మణుడై జన్మించి తరించును. ఇట్టి 12 జ్యోతిర్లింగములు శ్రీకోటిలింగేశ్వరస్వామి వార్ల ఆలయ ప్రాంగణములో ప్రతిష్ఠించ బడి ఉన్నవి.

(ముఖ్య శివలింగముల నిర్దేశము)

గంగాతీరమున విలసిల్లు ముక్తి ప్రదమగు కాశీక్షేత్రము భూలోకమున శివుని రాజధానియై మహాలింగముగ భావింపబడుచున్నది. అచ్చోట అవి ముక్తేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, వృద్ధ బాలేశ్వరుడు, తిలభాండేశ్వరుడు, దశాశ్వమేధేశ్వరుడును ముఖ్య శివలింగములై యున్నవి. గంగాసాగర సంగమమున సంగమేశ్వరుడు, భూతేశ్వరుడును విలసిల్లుచున్నారు. కౌశికీ నదీ సమీపమున నారీశ్వరుడు, గండకీనదీ తీరమున వటుకేశ్వరుడును, ఫల్గునదీతీరమున పూరేశ్వరుడు, సిద్ధినాధేశ్వరుడును, ఉత్తర నగరమున దూరేశ్వరుడును, శృంగేశ్వరుడును, వైద్యనాథుడును, దధీచి మహర్షిదగు యుద్ధ ప్రదేశమున జప్యేశ్వరుడును, గోపేశ్వరుడును, రంగేశ్వరుడును, వామేశ్వరుడును, నాగేశుడును, కామేశుడును, విమలేశ్వరుడును, వ్యాసేశ్వరుడును, సుకేశేశు దును, భాండేశ్వరుడును, హుంకారేశుడును, సురోచనేశుడును, భూతేశ్వరుడును, సంగమేశుడును, తప్తకానదీ తీరమున కుమారేశ్వరుడును, సిద్దేశ్వరుడును, సేనేశుడును, రామేశ్వరుడును, కుంభేశుడును, నందీశ్వరుడును, పుంజేశుడును, పూర్ణా సమీపమున పూర్ణకేశుడును; ప్రయాగయందు కాశీదశాశ్వమేధఘట్టమునను బ్రహ్మదేవునిచే స్థాపింపబడిన బ్రహ్మేశ్వరుడును, సోమేశ్వరుడును, భరద్వాజేశ్వరుడును, శూలకంటేశ్వరుడును, మాధవేశుడును, సాకేతనగరమున నాగేశుడును, పురుషోత్తమ నగరమున భువనేశుడును, లోకేశుడును, కామేశ్వరుడును, గంగేశుడును, శక్తేశ్వరుడును, శుక్రసిద్ధేశ్వరుడును, పటేశ్వరుడును, సింధుతీరమున కపాలేశుడును, వక్రేశుడును, ధౌతపాపేశ్వరుడును, పరమేశ్వరుడును, భీమేశ్వరుడును, సూర్యేశ్వరుడును, నందేశ్వరుడును, నాకేశ్వరుడును, రామేశ్వరుడును, విమలేశ్వరుడును, కంకటకేశ్వరుడును. పూర్ణాసాగర సంగమమున ధర్తుకేశ్వరుడును, చంద్రేశ్వరుడును, సిద్ధేశ్వరుడును, బిల్వేశ్వరుడును, అందకేశుడును, శరణేశ్వరుడును, కర్దమేశుడును, అర్బుదాచలమున కోటీశుడును, శరణేశ్వరుడును, కర్దమేశుడునుచ అర్భుదాచలమున కోటీశుడును, అచలేశుడును, కౌశితీరమున నాగేశుడును, అనంతేశ్వరుడును, యోగేశ్వరుడును, చండీశ్వరుడును, సంగమేశ్వరుడును అను శివలింగముల భుక్తిముక్తి ప్రదములుగా నెలకొని యున్నవి అని శ్రీ శివమహాపురాణములో ఉన్నది.

మరి మన క్షేత్రములో ఉన్న శివలింగాల మహత్యాన్ని చూద్దాం. పరమేశ్వరుని ప్రప్రథమ భక్తుడైన శ్రీమహావిష్ణువు తాను ప్రతిష్ఠించుకున్న ఇంద్రనీలమణి లింగానికి నిత్యము అర్చనాభిషేకములు చేసేవారు. తాను నిత్యము శివాభిషేకము చేయుటయే కాక దేవతలకు కూడ వారి వారి తాహతులకు తగ్గట్లుగా విశ్వకర్మ చేత వివిధ శివలింగాలను చేయించి యిచ్చినట్లుగా శ్రీ శివమహాపురాణములో తెలుస్తుంది. అటువంటి దేవతా నిర్మిత శివలింగాలను శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నాయి.

పరమేశ్వరుని అనుగ్రహం – అపూర్వ శివలింగాల దర్శనం

  1. తామ్ర లింగేశ్వరుడు : సూర్యనారాయణమూర్తి ఆరాధించే శివలింగము,
  2. మరకత లింగేశ్వరుడు : పరుణదేవుడు ఆరాధించే శివలింగము.
  3. ఆయుస్సు లింగేశ్వరుడు: శనీశ్వరుడు, యమధర్మరాజు ఆరాధన చేసే శివలింగము.
  4. సహస్ర లింగేశ్వరుడు : సీతాదేవి ఆరాధించే శివలింగము.
  5. అరకూట లింగేశ్వరుడు : ద్వాదశ ఆదిత్యులు ఆరాధించే శివలింగము.
  6. క్షీర లింగేశ్వరుడు : చంద్రుడు ఆరాధించే శివలింగము.
  7. దారు లింగేశ్వరుడు : మునీశ్వరులు ఆరాధించే శివలింగము.
  8. త్రపులింగేశ్వరుడు : అష్టవసువులు ఆరాధించే శివలింగము.
  9. కాంస్య లింగేశ్వరుడు: వసువులు ఆరాధించే శివలింగము.
  10. నాగ లింగేశ్వరుడు : ఆశ్వనీదేవతలు ఆరాధించే శివలింగము.
  11. సర్వ లింగేశ్వరుడు : ఋషులు ఆరాధించే శివలింగము.
  12. నీలకంఠేశ్వరుడు : దేవతలు ఆరాధించే శివలింగము.
  13. మహా లింగేశ్వరుడు: సర్వులు ఆరాధించే శివలింగము

భూకైలాసం – జ్ఞానమార్గము – కర్మమార్గము

శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి వారి సన్నిధానం

(పాతాళ రజితలింగేశ్వరుడు)

భక్తులు ప్రధాన ఆలయములో ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్లను దర్శించుకొని, మెట్ల మార్గాన భూగృహము నందు వేంచేసియున్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి వారిని దర్శించుకోవచ్చు.

శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వరస్వామి వారి సన్నిధానంలో ప్రతి నిత్యము కోటిలింగ ప్రతిష్ఠలలో భాగంగా ప్రతిష్ఠ చేసుకొను భక్తులు ప్రప్రథముగా శ్రీ రాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో వారి ప్రతిష్ట లింగానికి అబిషేకార్చనలు జరుపుకొని తదుపరి భూగృహంలో ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి సన్నిధిలో తమ స్వహస్తములతో స్వయముగా శివలింగాన్ని ప్రతిష్టించుకొందురు. వీరి సన్నిధానంలోనే సూర్యలింగము (రసలింగము), చంద్రలింగము (స్పటిక లింగము) ప్రతిష్టించబడి ఉన్నవి. ఈ సన్నిధానంలోనే శ్రీ మహారాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ మహారాజరాజేశ్వర స్వామివారి చరప్రతిష్టా స్ఫటిక మూర్తులు గలవు. శిమతస్థాపన, శివతత్వ ప్రచారం, శివాలయముల జీర్ణోద్ధరణ మొదలగు కార్యక్రమముల నిమిత్తం పూజ్య శివస్వామి వారి ఆధ్వర్యంలో జరుగు విశేష అభిషేకార్చనలు, హోమకార్యక్రమములకు శ్రీ మహారాజరాజశ్వరీదేవి సమేత శ్రీ మహారాజరాజేశ్వరస్వామివారు విచ్చేసి భక్తులను ఆశీర్వదించెదరు. వీరి దర్శనము అందరికి శ్రేయోదాయకము.

అన్నదానము – మహాదానము

శ్రీ శైవక్షేత్రమునకు విచ్చేయు భక్తులకు ప్రతినిత్యము అన్నప్రసాద వితరణ జరుగుతుంది.

అన్ని దానములకన్నా అన్నదానము శ్రేష్టమైనది. ఎవరైతే అన్నమును పరబ్రహ్మస్వరూపంగా భావిస్తారో వారు సమస్త ధనధాన్యాలతో, సత్సంతానముతో బ్రహ్మవర్చస్సుతో కీర్తివంతులు అగుదురు. ఆహారం నుండే సమస్త జీవులు ఉద్భవించినవి. అన్నముతోనే సమస్తము పోషించబడుచున్నవి. అన్నమును పవిత్ర భావముతో భగవంతునికి చేరుటకు ద్వారముగా భావించాలి. ఈ అన్నదాన మహాయజ్ఞములో భక్తులందరూ తమ సహాయ సహకారాలు అందించి శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల మరియు శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామివార్ల సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది తరించవచ్చు.

మహా కైలాసము – యోగమార్గము – కర్మ మార్గము

భక్తియోగసాధన సంపూర్ణ పూర్ణ మార్గమే మహాకైలాసము. ఇందు పంచభూత లింగములు అనగా పృథ్విలింగము, జలలింగము, అగ్నిలింగము, వాయు లింగము, ఆకాశలింగములతో కూడి ఓం నమఃశివాయ అను మహామంత్రమునకు మాతృస్వరూపిణిగా శ్రీ శివపంచాక్షరీదేవి ప్రతిష్టించబడి ఉన్నది. ఈ సన్నిఆనమునకు ఇరు ప్రక్కల భవ, శర్వ, ఈశాన, పశు పతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహదేవ అను నామములతో అష్టమూర్తి లింగములు, ముందు భాగమున ఏకాదశ రుద్ర శివలింగములను మనం దర్శించుకొనవచ్చు. అత్యద్భుతమైన ఇంద్రలింగమును ఇక్కడ మనం దర్శించుకొంటాము. మరియు భక్తులచే కోటి లింగములతో భాగంగా బాణలింగ ప్రతిష్టలు ఇక్కడ జరుగుతుంటాయి.

1. సహస్రలింగాల ప్రతిష్ఠ (1116 పాదరసలింగములు)

సహస్రమనగా అనంతము. భగవంతుణ్ని అనంత నామాలతో మనం పూజిస్తాం. అటువంటి భగవంతుని నామాలను సహస్రం అనగా 1116 శివలింగాలను 1116 మంది దంపతులచే మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో లక్షలాది మంది భక్తుల ఓం నమఃశ్శివాయ నామస్మరణతో ఒకేసారి అన్ని లింగాలను ప్రతిష్టించటం జరిగింది. ప్రతిష్ఠానంతరం ప్రతిరోజు అభిషేకార్చనలు, మహానివేదనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సహస్ర లింగాలకు అభిషేకార్చన మహానివేదనలు జరపటం ఎంతో పుణ్యము మరియు విశ్వానికే శుభప్రదము. ఈ సహస్ర రసలింగాల దర్శనం, పూజనం మన జీవితాలకే ధన్యము.

2. మహా లింగా ప్రతిష్ఠ (360 స్పటిక లింగాలు)

ఈ శైవక్షేత్రములో 360 స్ఫటికలింగాలతో మహాలింగ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇటువంటి మహాలింగార్చన వలన కలిగెడి ఫలము అనంతమైనదియు, ఎన్నడు నశించనిది అని శాస్త్రములలో చెప్పబడియున్నది. యజ్ఞ, యాగ, దాన తాపంబులచే పుణ్యఫలము కలుగును, కాని ఆ పుణ్యఫలము శాశ్వతమైనది కాక, కొంత కాలమునకు నశించునదిగా తెలియనగును, కాని మహాలింగార్చన ఫలితము మాత్రము అనంతమైనది. అటువంటి మహాలింగార్చన ధర్మక్షేత్రంగా భాసిల్లుతూ భూకైలాసంగా నిర్మాణము జరిగిన శ్రీశైవక్షేత్రంలో ప్రతిఒక్కరూ ఈ స్పటిక మహాలింగార్చన గావించుకొని జీవన్ముక్తి పొంది తరించండి.

అష్టోత్తర బాణలింగాలు – (108 నర్మదా బాణలింగాలు)

నర్మదానదిలో లభించే స్వయంభూ లింగాలే ఈ బాణ లింగాలు. అనగా ప్రకృతిసిద్ధంగా మనకు లభిస్తాయి. బాణలింగార్చన ఇహ, పరలను సుఖాలను రెండిటిని ప్రసాదిస్తుంది. వీటిని మనోభీష్ట లింగాలంటారు. మానవ జన్మపొంది పుత్రసంతాన సౌఖ్యాన్ని కోరుఆరు ఈ బాణలింగార్చన చేయాలి. అటువంటి లింగాలను ఇక్కడ అష్టోత్తర లింగాలుగా ప్రతిష్టించబడినాయి.

క్షేత్రపీఠదర్శనమ్ – భూకైలాస దర్శనమ్

ఈ క్షేత్రాధిపతియైన శ్రీశివస్వామి వారిచే ప్రప్రధమంగా పీఠాన్ని శ్రీశైవక్షేత్రములో ఏర్పాటుచేసి క్షేత్రనిర్మాణానికి పూనుకోవటం జరిగింది. అదియే క్షేత్రపీఠం. క్షేత్రములకు పీఠము చాలా ముఖ్యమైనది. కారణమేమనగా క్షేత్రములలో యున్న సమస్త దేవతాలయములకు పీఠాధిపతులు పీఠములనుండియే శక్తిని ధారబోయుచుందురు. అదెట్లనిన్న, క్షేత్రములోయున్న ప్రధాన దేవాలయములలో యున్న మూర్తులన్నింటి స్వరూపములను స్వల్పప్రమాణములతో విగ్రహముల తయారు చేయించి, స్థాపించుకొని, పీఠాధిపతులు ప్రతినిత్యమూ తమ పీఠమందు స్థాపితమైన దేవతామూర్తులను వారి వారి సాంప్రదాయానుసారంగా అర్చించి, జప-అభిషేక-హోమాది క్రియలన్నీ యధావిధిగా జరిపి తత్సంబంధమయిన శక్తిని క్షేత్రములో నున్న ప్రధాన ఆలయములలో దేవతామూర్తులకు ధారపోసి వాటికి శక్తిని కలుగజేయుచుందురు. పీఠములయొక్క అర్చనా విధులన్నియు పీఠాధిపతులే నిర్వర్తించుచుందురు. మన శైవక్షేత్రంలో యింతవఱకు మనము శ్లాఘించుకొన్నవేగాక యింకా యెన్నో శివసంబంధమయిన మూర్తులు స్థాపింపబడియున్న కారణంగా యివన్నీ కూడా నిత్యశోభయమానముగా ప్రకాశించుచున్నా, శక్తినాకర్షించుకొంటున్నా క్షేత్రపీఠమే కారణం గనుక క్షేత్రపీఠదర్శనం భూకైలాస దర్శనంగా శ్లాఘ్యము.

శివస్వామి దర్శనం – సాక్షాత్ శివదర్శనమ్

యోగము లేనిదే యెంతటి మానవుడయినా శివాలయ నిర్మాణము చేయలేడు. ధనవంతుడై యుండవచ్చును. ధనవంతుడయితే భోగభాగ్యములను భావింపవచ్చును గాని ఆలయ నిర్మాణము చేయలేడు. అందులోనూ శివాలయ నిర్మాణము చాలా దుర్లభము. యోగమున్నపుడే అది సాధ్యమగును. గతజన్మ పుణ్యఫలముననుసరించి కోట్లకొలది ధనము నార్జించి 10 అంతస్తుల భవన నిర్మాణము జేసుకొని అందులో ఇష్టోపభోగములనుభవించగలడుగాని యోగము శివానుగ్రహము లేనిదే ఆలయ నిర్మాణములో ఒక్క యిటుకరాయిని కూడా పేర్చలేడు. ఆలయ నిర్మాణ ప్రతిష్టాదులు చేయవలెనన్న అందుకు ముఖ్యంగా శివానుగ్రహం కావాలి. నిరంతర పంచాక్షరీ మహామంత్ర జపధురీణుడై యుండాలి. గతజన్మల సంస్కారముండాలి. అప్పుడుగాని యిట్టి దేవతా నిర్మాణాదులు చేపట్టలేడు. ఒక్క ఆలయ నిర్మాణమునకు యింతటి యోగ్యత అవసరమైయున్నప్పుడు – వివిధ రకములైన శివాలయములతో యింటి మహాక్షేత్రము నిర్మాణము గావించవలెనన్న అదీ కూడా పుణ్యప్రదములయిన పంచమహానదులలో ఒకటిగా శ్లాఘించబడిన కృష్ణానదీ ఒడ్డున నిర్మాణము గావించవలెనన్న యెంతటి యోగ్యత కావలెనో యెంతటి శివానుగ్రహ సంపన్నుడయి యుండవలెనో – యెన్నో జన్మల సుసంస్కారము యుండవలెనో యెంతటి పంచాక్షరీ మహామంత్ర జపధురీణుడై యుండవలెనో ఆలోచింపుడు? అదీగాక అనతికాలంలోనే యింతటి మహాక్షేత్ర నిర్మాణము గావించుట గత జన్మల శివారాధనా సంస్కార ఫలితమే గాని వేరుకాదు. గతజన్మల సంబంధిత శివారాధనా ఫలము ఈ జన్మకు అనుసంధింపబడియున్న కారణం శివస్వామి ఈ జన్మలో శ్రీ శైవక్షేత్ర నిర్మాణదీక్షా కంకణుడయి అనతికాలంలోనే శివానుగ్రహంతో దేశంలోనే అరుదైన యింతటి మహాక్షేత్ర నిర్మాణము గావింపగలిగారు. తనకున్నదంతా ఈ క్షేత్రమునకు వెచ్చించి, చివరకు మాతృతుల్యయైన తన వదినగారు పుత్రవాత్సల్యంతో తనకిచ్చిన ధనాన్ని, తన సోదరీణులు యిచ్చిన ధనాన్ని సహితం ఈ క్షేత్రమునకై వెచ్చించి ఆదర్శపురుషునిగా నిలచి క్షేత్ర నిర్మాణము గావించిన మహామనిషి, మహాశివభక్తుడు. యిట్టి మహా శివభక్తుడైన శివస్వామి ఉదయమునే లేచి స్నానాదికములు పూర్తి చేసుకొని శరీరమంత విభూదిరేకలు ధరించి మెడలో రుద్రాక్షమాలికలు ధరించి పీఠమధిరోహించి సాంబశివునకు అర్చనాదులు జేయుచున్న సమయంలో శివస్వామిని దర్శించిన భక్తులకు స్వామి పై వార్కి గల భక్తి విశ్వాసములననుసరించి ఆ సమయంలో అపర శివుని దర్శించిన అనుభూతిని పొందగలరు. గనుక శివస్వామి దర్శనం సాక్షాత్ శివదర్శనమని శ్లాఘ్యమై యున్నది.

షణ్మతపీఠస్థాపన

సాక్షాత్ భగవత్ శంకరస్వరూపులైన శ్రీ ఆదిశంకరాచార్యులవారు అద్వైత ప్రచారంతో షణ్మతపీఠస్థాపన చేవారు. మరల ఇంతకాలమునకు శ్రీ శైవక్షేత్రములో గణపతి, కుమారస్వామి సూర్యన్నారాయణమూర్తి, శ్రీమన్నారాయణ స్వామి, శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వరస్వామి వారి ప్రతిష్ఠలతో పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామి వారు షణ్మత పీఠస్థాపన చేశారు. పరమేశ్వరుని విభిన్న శక్తులే విభిన్న దేవతలుగా పూజింపబడుచున్నారు. నిత్యము శ్రీ శైవక్షేత్రములో షణ్మతపీఠార్చనలు జరుగుతాయి.

అద్భుతం – నవపాషానాల శివలింగము – ఆరోగ్యం

భారతదేశంలో అతి ప్రాచీనమైనది పాషాణ విద్య. ఈ విద్యను పొందిన యోగులు అనేక రకాల దీర్ఘకాలిక రోగాలను, రాచకురుపులను నయం చేసేవారు. కాలక్రమేణా ఈ విద్యకు సంబంధించిన తాళపత్రాలు లభ్యం కావట్లేదు. కానీ స్వామిజీవారు పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాదబలంతో మళయాల దేశం నుంచి అక్కడ మంత్రగాళ్ళను మెప్పించి వాటిని మన దేశానికి తీసుకువచ్చారు. మన దేశంలో తమిళరాష్ట్రం పళనిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహం నవపాషాణాల విగ్రహం మరియు రామేశ్వరంలో విడివిడిగా పాషాణ శివలింగాలను శ్రీరామచంద్రమూర్తి వారు ప్రతిష్ఠించినట్లు చెప్పడుచున్నవి. మన రాష్ట్రంలో ఆలంపూరంలో బాలబ్రహ్మ ఆలయాలలో ఉపపాషాణ లింగాలు ప్రతిష్టించి ఉన్నవి. కాని నవపాషాణాల లింగము దేశంలో ఎక్కడా లేదు. అటువంటి లింగాన్ని స్వామిజీవారు సిద్ధం చేస్తున్నారు. అప్పుడు సంపూర్ణ శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిస్టించుతారు. ఆ శివలింగానికి వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో పాశుపత సంపుటీకరణతో రుద్రాబిషేకం చేసిన ఎడల రసాయనిక చర్య జరిగి దివ్య ఔషధంగా మారుతుంది. ఈ శివపాదోదక తీర్థా సేవించినచో ఎన్నో దీర్ఘకాలిక రోగాలను సంపూర్నంగా నివారణ చేస్తుందీ తీర్థం. అటువంటి శుభదినం కోసం మనందరం ఎదురుచూద్దాం!

పరమ శివభక్తులు అరువది మువ్వురు (63)నయనార్ల పంచలోహమూర్తుల చరప్రతిష్టలు

పరబ్రహ్మము సుగుణమనియు, నిర్గుణమనియు రెండు తెఱగులు. నిర్గుణ పరబ్రహ్మము, నామరూప గుణాది రహితమగుటచే సమాధిస్థితులైన యోగీంద్రులకు దప్ప అన్యులకు గోచరముకాదు. మనోనిగ్రహము, అంతర్దృష్టి లేని సామాన్యుడు నామ, రూప, గుణ సంశోభితమైన సగుణ బ్రహ్మము నారాధించి కాంక్షితార్థముల బడయజాలుదురు. సగుణ బ్రహ్మము ఉ పాసకుల యభిరుచి భేదములను బట్టి వివిధ నామరూపములతో ముప్పారుట సంభవించినది. ఆ వివిధ రూపములలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములు ముఖ్యమైనవి. ఈ మువ్వురే సర్వ భారతీయుల కారాధనీయులగుచున్నారు. త్రిమూర్తులు మువ్వురును సమాన మహిమల ప్రాభవములు కలవారై వివిధ పురాణములు వారి మహనీయ చరితములను భక్తజన రక్షణ పరాయణతను వర్ణించి యున్నవి. ముముక్షువులైన మానవులు పూర్వజన్మ సంస్కార విశేషములను బట్టి వారిలో నాత్యంతిక భక్తి వహించి వాంఛితార్థ ప్రాప్తినొంది యానందింతురు. అందుజ్ఞానమార్గము పరిణతచేతస్కులైన మహాయోగులకుదప్ప నన్యులకు సాధ్యమగునట్టిదికాదు. కర్మమార్గము కూడా జ్ఞానమార్గమువలనే బహుక్షేశసాధ్యమగునది. ఆ మార్గము అనుసరించువారు లింగ వయో వర్ణాశ్రమములను బట్టి స్తుతి స్మృతి పురాణాదులచే విధింపబడిన కర్మకలాపమును ఫలాపేక్ష రహిత చిత్తులై శ్రద్ధతో నాచరింపవలయును. ఇక భక్తిమార్గము సర్వజనానుసరణమైన సులభమార్గము. ‘మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవగరియసి’ యని యాచార్య వాక్యము.

ఈ భక్తి మార్గముననుసరించి మోక్షసామ్రాజ్యము నధిగమించిన భక్తవరేణ్యులు అనేకులున్నారు. పురాణములలో పరమేవ్వరుని గూర్చి తపమాచరించి వరములను బడసిన వారి వృత్తాంతములు పెక్కు కనిపించును. అడవులకేగి తపస్సా చరింపక పోయినను ప్రపంచము నందెయుండి పరమభక్తితో పరమేశ్వరుని అనుగ్రహము బడసిన భక్త శిఖామణులు లెక్కకు మిక్కిలిగి యున్నారు. వారు ప్రపంచము నలుమూలలయందు విరాజిల్లి యున్నారు.

పరమపూజ్య పుణ్య పరమశివభక్తుల దర్శన భాగ్యాన్ని పొందినచో మన హృదయాలలో భక్తి బీజము లంకురించుననటలో సందేహములేదు. అదృష్టముండుచో నాబీజములే మొలకలై, వృక్షములై, మహావృక్షములై మోక్షఫలములనిచ్చుట సంభవించును. కనుకనే కలియుగములో పరమపావన పవిత్ర కృష్ణానది తీరములో దినదిన ప్రవర్ధమానంగా, ధర్మ క్షేత్రంగా వెలుగులీనుతూ భూకైలాసముగా నిర్మాణము జరిగిన శ్రీశైవక్షేత్రపీఠంలో అరుపదిమూడు నయనార్ల పంచలోహచర ప్రతిష్ఠామూర్తులను దర్శించండి. శివానుగ్రహముతోపాటు, శివభక్తుల అనుగ్రహాన్ని పొందండి.

శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీకోటిలింగేశ్వరస్వామివార్ల నిత్యకళ్యాణ మహోత్సవములు

విశ్వమానవ కళ్యాణమే పరమావధిగా రండి. మీ జన్మ సాఫల్యమునకు బహిక, ఆముష్మిక సుఖశాంతులకు అన్నింఇకి ఏకైక మార్గం శివసాన్నిధ్యం అని గ్రహించండి..

కలియుగంలో పరమపావన పవిత్ర కృష్ణానదీతీరంలో దినదిన ప్రవర్ధమానంగా ధర్మక్షేత్రంగా వెలుగులీనుతూ భూకైలాసంగా నిర్మాణము జరిగిన శ్రీ శైవక్షేత్రంలో నిత్యశివకల్యాణ మహోత్సవము జరిపించుటకు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామి వారిచే శుభసంకల్పము గావించబడినది. నిత్యశివరాత్రిగా భాసిల్లుతున్న శ్రీ శైవక్షేత్రములో ప్రతి నిత్యము దంపతులు స్వామివారి కల్యాణ మహోత్సవములో పాల్గొని కనులారా వీక్షించి, తీర్థప్రసాదములు స్వీకరించి తరించండి.

సృష్టి ప్రారంభమైన కాలంలో పంచముఖ బ్రహ్మ, నారాయణమూర్తి వద్దకు రాగా వైకుంఠుడు యోగనిద్ర పరవశుడై యుండెను. అంత బ్రహ్మ అహంకారపూరితుడై విష్ణువునుగాంచి ‘నారాయణ! సమస్తసృష్టికర్తనైన నేను వస్తే నన్ను లెక్కగొనక, గౌరవించక ఇట్లు అవమానింతువా! సమస్త భువనభాండములకు ఆధారము నేనే. ఇప్పటికైనా కనులు తెరచి లేచి నన్ను గౌరవించు అట్లు అతిథిమర్యాద చేయనివాడికి ప్రాయశ్చిత్తము విధించబడుతుంది’ అనెను. అంత నారాయణమూర్తి చిరునవ్వుతో ‘చతురాననా! నీకు స్వస్థత కలుగుగాక అని వ్యంగ్యంగా అనెను. ఈ విధముగా ఒకరినొకరు ఆత్మస్తుతితో నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు నేనే సర్వేశ్వరుణ్ణి అని వాగ్వివాదములు చేయుచుండగా అంత సర్వజ్ఞుడైన శంకరుడు అదిగాంచి వారిరువురికి గర్వభంగము జేయుటకు లోక కళ్యాణార్ధం వారి ఇరువురి మధ్య పాతాళము నుండి అగ్ని స్థంభముగా భూమిని చీల్చుకుని ఊర్థ్వలోక పర్యంతం కనుమరుగైనంత దూరము వరకు ఆవిర్భవించెను. అంత బ్రహ్మ విష్ణువులు అగ్నిస్తంభలింగరూపములో ఉ న్న శివలింగాన్ని చూచి అత్యంతాశ్చర్యభరితులై దాని ఆధ్యంతములు తెలుసుకొనుటకై బ్రహ్మ హంసరూపమున ఆకాశమునకు, విష్ణువు అధోభాము చూచుటకై వరాహరూపమున పాతాళమునకు పోయెను. ఇట్లు బ్రహ్మ విష్ణువులు తిరిగి తిరిగి ఆధ్యంతములు కనుగొనలేక ఇదంతయూ ఈశ్వర మాయయని కనువిప్పుకలిగి సర్వేశ్వరుని అనుగ్రహము కొరకు మహాభక్తితో స్తుతించి ప్రార్థించిరి. అంత భోళాశంకరుడైన శంకరుడు వారి స్తుతిమొరలాలకించి వారిని అనుగ్రహింపదలచి అగ్నిస్తంభము నుండి సకల మూర్తిత్వంతో దర్శనమిచ్చి అనుగ్రహించెను. అదియే ఆరుద్రానక్షత్రయుక్త మహాశివరాత్రి, శివరాత్రులు నాలుగు విధములు 1) నిత్యశివరాత్రి 2) మాస శివరాత్రి 3) యోగిక శివరాత్రి 4) మహాశివరాత్రి ఇందులో 1) సర్వకాల సర్వావస్థలయందు నిష్ఠాగరిష్టుడు అయి ఆ శంకరుణ్ణి పూజించడం నిత్య శివరాత్రి. 2) ప్రతినెల కృష్ణపక్షంలో చతుర్దశినాడు అనగా అమావాస్య ముందురోజు వచ్చేది మాసశివరాత్రి. 3) సోమవారంతో కలిసిన అమావాస్య రోజున వచ్చేది యోగిక శివరాత్రి. 4) మాఘ బహుళ చతుర్దశినాడు వచ్చేది మహాశివరాత్రి.

శ్రీశైవక్షేత్రము – నిత్యశివరాత్రి క్షేత్రము

శ్రీశైవక్షేత్రములో ప్రతిష్ఠించబడి యుగధర్మలింగాలుగా పిలువబడుతున్న 1) పాదరస లింగము (మోక్షలింగము), 2) రత్నలింగము (అమృతలింగము) 3) స్పటిక లింగము (జీవన్ముక్తి లింగము), 4) పంచలోహ లింగము (సంకల్ప లింగము) మొదలగు శివలింగములకు అర్చనాభిషేకములు మరియు భూగృహులో ప్రతిష్ఠించబడిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీవిశ్వేశ్వర స్వామివార్లకు అన్నాభిషేకములు, శ్రీ రాజరాజేవ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్లకు అభిషేకార్చనలు, సహస్ర లింగార్చనలు, మహాలింగార్చనలు, జప, తప, జ్ఞాన యోగాలతోపాటు శ్రీ శివస్వామి వారిచే ప్రతినిత్యము జరుపబడుచున్న నిత్యకోటిలింగాల ప్రతిష్టాకార్యక్రమాలతో నిత్యశివరాత్రిగా భాసిల్లుతున్న శ్రీశైవక్షేత్రములో జరుపబడు పూజాకార్యక్రమములు విశేష ఫలదాయకములు. ఆది దంపతులైన శ్రీ పార్వతీపరమేశ్వరుల నిత్యకళ్యాణ మహోత్సవాలను భక్తులచే జరిపించుటకు శు భ నిర్ణయముగావించబడినది. కావున భగవత్ బంధువులందరూ నిత్య శివకళ్యాణ కార్యక్రమములో విరివిగా పాల్గొన్ని శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల అనుగ్రహ ఆశీర్వాదములను పొంది తరించండి.

భారత ధర్మదేవత

శ్రీశ్రీశ్రీ బ్రహ్మచారి శివస్వామి మహాసంస్థానము నందు
శ్రీకోటిలింగ మహాక్షేత్రము వారిచే నిర్మాణములో ఉన్న

కైలాసధామ్

పవిత్ర కృష్ణానది పరివాహక తీరమునందు ప్రపంచంలోనే ప్రప్రథమంగా శ్రీశైవక్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతులు శ్రీ ఇవస్వామి వారియొక్క ఆధ్వర్యమున శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము నిర్మాణమునకుఆను శివసంకల్ప బలముతో శుభసంకల్పం గావించబడినది. యిట్టి మహత్ కార్యక్రమము పురాణకాలంలో ఒక్క శ్రీరామచంద్రులవారు మాత్రమే యుగాంతర్గత త్రేతాయుగంలో

నిర్వహించినారు. అనగా ఇప్పటికి సుమారు 1,46,27,097 సం॥లకు పూర్వము మన భారతదేశంలో నవకోటి శివలింగ ప్రతిష్ఠలు జరిగినవి. మరల ఇంతకాలమునకు శ్రీ శివస్వామి వారు శివసంకల్పిత కోటిలింగ ప్రతిస్టా కార్యక్రమ సందర్భంగా సకలజన అభీష్ట సిద్ధికై లోక కళ్యాణార్ధమై, సకల జనకోటి లింగ ప్రతిష్టాభాగస్వామ్య సిద్ధికై, మహిళల సౌభాగ్య సిద్ధికై అనావృష్టి దుర్భిక్ష దోషనివారణకై ప్రాపంచిక శాంతి సౌభాగ్య సాధనకై, దీన జనోద్ధరణకై, సదాశివ అనుగ్రహ ప్రాప్తికై, అఖండకోటి లింగ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని పూజ్యశ్రీ శివస్వామిజీ వారు సంకల్పించినారు,

భూమి నుంచి స్వయముద్భవమైన వేలాది లింగములను సంయక్రోతిలో పూజించుట వల్ల లభించే ఫలితంకంటే కోటి ప్రతిష్ఠ దర్శనం అనంత పుణ్యఫలం. ఈ స్పటిక లింగముల ప్రతిష్ఠలు సర్వవర్ణస్తులు, కులమత జాతిలింగ వయోభేదములు లేకుండా పుణ్యస్త్రీలు, వితంతువులు, పెద్దలు, పిన్నలు, అందరు ఈ పుణ్యప్రతిష్ఠ కార్యక్రమములో పాల్గొనవచ్చును.

ఎవరికి వారు తమతమ సమయానుకూలముగా తమ తమ జీవన్ముక్తి లింగమును ప్రతిష్ఠించుకొనవచ్చును. అంటే ఒక ప్రత్యేకమైన తిథి లేదా తేది ఉదా తమ స్వ, లేక కుటుంబ సభ్యుల జన్మదినము, వివాహదినము, గృహప్రవేశము సన్నిహితులు అమరులైన తేది లేక తిథిలనాడు కూడా వారికి మోక్షము కలగాలని ప్రార్థిస్తూ లింగ ప్రతిష్టను వారి పేరున చేయవచ్చు.

సమస్త మానవాళి విశ్వశాంతికి, లోకకళ్యాణార్థం శ్రీ శివస్వామి వారిచే సంకల్పించిన ఈ కోటిలింగ ప్రతిష్ఠా కార్యక్రమములో పాల్గొని ప్రతి ఒక్కరు శివలింగాలను ప్రతిష్ఠ చేసి సంపూర్ణముగా పార్వతీ పరమేశ్వర ఆశీర్వాదములు పొంది తరించండి.

ప్రతిష్ఠా శివలింగాలను క్షేత్రము వారిచే ఎటువంటి రుసుము లేకుండా భక్తులకు ఇవ్వబడును. మీ స్వహస్తములతో స్వయముగా మీ గోత్ర నామములతో శివలింగ ప్రతిష్ఠ గావించుకొనండి. ప్రతిష్ఠ, అర్చనాభిషేక హోమాది కార్యక్రమముల ఏర్పాటు నిమిత్తము అగు ఖర్చును క్షేత్రకార్యాలయమునందు సంప్రదించి తెలుసుకొనండి.

శతావతారాలు

అనంతుడైన పరమాత్మ ఈశ్వరుడు తాను ధర్మ సంరక్షణార్థం లోకహితం కోసం తన నుంచి అనేక అంశలను సృష్టించి లోకకళ్యాణాన్ని కలుగజేసారు. వాటిలో ముఖ్యంగా శత అవతారాలు విశేషమైనవి. ఆ అవతారాలను మనందరకు దర్శింప చేయాలని పూజ్య స్వామిజీ వారి సంకల్పము. అందుచే సహస్రలింగాల చుట్టూ ఈశ్వరుని శత అవతారాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ భూలోకం భూకైలాసంగా విరాజిల్లాలనే బృహత్తరమైన సంకల్పం ఈ నిర్మాణం.

శ్రీకోటి లింగ మహాశైవక్షేత్రము

ధర్మాచరణ – త్యాగాచరణ
కర్మాచరణ – కార్యాచరణ

శ్రీ వాసవీమాత ఆర్షధర్మ పరిరక్షణ కొరకు అధర్మ వినాశనముకై కన్యకగా ధర్మాచరణకు కట్టుబడి, అపూర్వ త్యాగ మహిమతో త్యాగధనులైన 102 గోత్రముల ఆర్యవైశ్య దంపతులతో తాగాచరణకు సిద్దపడి కర్మాచరణతో కూడిన అగ్నిప్రవేశము గావించి, మహాద్భుతముగా తన విశ్వరూపాన్ని చూపించి, విశ్వమాతగా, ఈ విశ్వమునకు కార్యాచరణ కొరకు దిశానిర్దేశం గావించి పరమేశ్వరుణ్ణి చేరుకొన్నట్లుగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ పురాణ వచనం.

అందుచేత విశ్వశాంతికై, లోక కళ్యాణము కొరకు ప్రతి ఒక్కరూ ధర్మాచరణ త్యాగాచరణ – కర్మాచరణ – కార్యాచరణ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, మన ఆర్ష ధర్మమును పరిరక్షించుట మన అందరి భాద్యత అని తలచి, శ్రీశైవక్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతులు శ్రీ శివస్వామివారు శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము నందు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయ నిర్మాణము చేసి, అందు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. విశ్వమాత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దర్శనం శుభప్రదం.

భారతీయ సంస్కృతి – నాగారాధన కాలసర్పః శాంతిర్భవతు

భారతదేశము అత్యంత పవిత్రమైన విశిష్టమైన సనాతనమైన సంస్కృతికి, ధర్మమునకు, పలు ఆరాధనలకు నిలయము. ప్రకృతిలోని అన్ని చేతనములలో కూడా దైవాంశను దర్శించి పూజించినారు భారతీయులు. మన వేద, ఇతిహాస, పురాణాలలో సదుల ప్రస్తావన, నాగుల మహోన్నతమైన సేవల విశ్లేషణములు పలుచోట్ల కానవస్తాయి. అలాగే యజుర్వేదములోని మైత్రేయణే శాఖలో సర్పారాధన సూక్తము చక్కగా చెప్పబడినది. మరి ఆ కాలయమునాటి నాగారాధనకు ఇది ఒక చక్కని తార్కాణము.

యజుర్వేదము :

నమోస్తు సర్పేభ్యో యే కా చ పృథివీ మను |
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ॥

అలాగే అధర్వణ వేదము :

యే అగ్నిజా ఓషధిజా అహీనాం యే అప్సుజా విద్యుత అబభ్రువుః |
యేషాం జాతాని బహుధా మహాంతి తేభ్య సర్పేభ్యో నమసా విధేయ ॥

ప్రసూక్తమును బట్టి నాగజాతి భూమి నుండి, నీటి నుండి, అగ్ని నుండి, ఔషధాల నుండి, విద్యుత్తి నుండి పలు రీతులలో పుట్టునని, భూమ్యాంతరిక్ష పాతాళ దేవలోకాదులలో సర్వత్రా వర్తించునని చెప్పబడుతున్నది. భారతదేశంలో ఆచరించు నాగముల పండుగలలో ముఖ్యమైనవి నాగపంచమి, నాగచతుర్థి. సుబ్రమణ్య షష్ఠి పేర్కొనదగినవి.

కాలసర్పయోగం

జాతకుని జన్మకూడలిలోని గ్రహాలు రాహు, కేతువుల మధ్యలో ఉన్న అట్టి గ్రహస్థితిని కాలసర్పయోగం అంటారు. కాలసర్పయోగం ఒక భయానక యోగం.

మహర్షి పరాశర మరియు వరాహ మిహిర వంటి జ్యోతిష్య ఆచార్యులు కాలసర్పయోగాన్ని గురించి వారి గ్రంథాలలో ప్రస్తావించారు. కాలసర్పయోగ నివారణ ఉపాయాలు కూడా తెలియజేశారు.

కాలసర్పయోగం ఏ వ్యక్తి ఉంటుందో, ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కోవలసి ఉంటుంది. చేయుపనుల యందు, అభివృద్ధియందు ఆటంకములు కలుగును. అతికష్టం, ఆలస్యం మీద అభివృద్ధి సాధించెదరు. మానసిక, శారీరక, ఆర్థిక మనెడి 3 విధాల సమస్యలు ఎదర్కోవలసి ఉండును. కాలసర్పయోగ జాతకుని భాగ్యప్రవాహమునకు రాహు, కేతువులు అవరోధము కల్గించును. అందువలన జాతకునికి అభివృద్ధి ఉన్నతి కలుగదు. వారికి ఏ పని స్థిరంగా ఉండదు. చేయు పనిలో చికాకులు, అడ్డంకులు కలుగును. క్రమంగా వారి జీవనం చాలా కష్టదాయకంగా ఉంటుంది. వారికి త్వరగా వివాహం జరుగదు. వివాహమైనా సంతాన లోపం కలుగుతుంది. సంతానసుఖం ఉండదు. వైవాహిక జీవనంలో ఇబ్బందులు, ఎడబాట్లు, ఋణబాధలు మొదలైన అనేక రకాల కష్టములు కలుగును.

తెలిసో తెలియకో చేసే, జరిగే కర్మల స్వరూపంగా ‘దుర్భాగ్యం’ జనించును. ఇవి 4 ప్రకారములుగా ఉండును.

1) సంతాన అవరోధ రూపములో వచ్చును. 2) కులక్షీణము లేదా కలహప్రియ భర్తలేక భార్య లభించడం. 3) కష్టపడినా ఫలితం లభించకపోవుట, ధనము కొరకు ఇబ్బందులు. 4) శారీరక బలహీనత మరియు మానసిక దుర్బలత కారణంగా నిరాశాభావం కల్గును. ఈ బాధలు భరించలేక శీఘ్రాతి శీఘ్రంగా మృత్యువును ఆహ్వానిస్తారు.

శైవక్షేత్రము నందు కాలసర్పదోష నివారణార్ధము ప్రతిష్ఠించబడిన నాగశిలలు

 కాల సర్పయోగ పీడిత జాతకులు తమకు ఎదురవు చెడు ప్రభావములను తప్పించుకొనుటకు పలు మార్గములు జ్యోతిష్య శాస్త్రము ద్వారా ఆచార్యులచే చెప్పబడినవి. వీనిలో ప్రధానంగా రాహు, కేతు గ్రహములకు అర్చనలు, దానములు, జపములు మరియు సర్పసూక్త హోమ కార్యక్రమముల ద్వారా నివారించుకోవచ్చును. మరియు నాగశిల ప్రతిష్ఠ ద్వారా నివారించుకో

వచ్చును. ఈ విధమైన కాలసర్పదోష నివారణ కార్యక్రమాన్ని నిర్దేశిత పుణ్యక్షేత్రాలలో నిర్వహించుట శ్రేయోదాయకం. ఇటువంటి నివారణ కార్యక్రమాన్ని ఒక మహాసంస్థానంగా, ఒక క్షేత్రముగా, ఒక ఆశ్రమముగా, ఒక ఆరామంగా పిలువబడుతూ శ్రీ శివస్వామి వారి శుభసంకల్పంతో కోటిలింగాలు ప్రతిష్ఠ గావించబడుతూ యుగధర్మాలైన శివలింగములు – 1) కృతయుగము పాదరసలింగము, 2) త్రేతాయుగము – రత్నలింగము, 3) ద్వాపరయుగము- స్పటికలింగము, 4) కలియుగము – పంచలోహ లింగములు ప్రతిష్ఠితమైన శ్రీ శైవక్షేత్రమునందు నిర్వర్తించుకున్నచో శీఘ్రముగా దోషనివారణ జరిగి సత్ఫలితాల్ని పొందవచ్చును.

స్పటిక లింగముల ప్రతిష్ఠల వలన కలుగు ప్రయోజనములు

  • ఒక స్పటిక లింగ ప్రతిష్ఠ (1) సర్వశుభములను నొసగును
  • రెండు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (2) అభీష్టములను నెరవేర్చును
  • మూడు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (3) సాధింపదగిన సత్కార్యములు సిద్ధించుట
  • నాలుగు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (4) ధర్మార్థ, కామముల నొసగును
  • ఐదు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (5) జీవితకాలమంతయు అభిలషితములనన్నిటిని నొసగును
  • ఆరు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (6) సమస్త పాపములను పోగొట్టును
  • ఏడు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (7) దారిద్య్రమును తొలగించును
  • ఎనిమిది స్పటిక లింగముల ప్రతిష్ఠలు (8) పూర్ణాయుష్యు నొసగును
  • తొమ్మిది స్పటిక లింగముల ప్రతిష్ఠలు (9) స్వర్గలోక వైభవమును పొందును
  • పది స్పటిక లింగముల ప్రతిష్ఠలు (10) స్వాభీష్టములను ఫలింపజేయును
  • పదకొండు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (11) సర్వత్ర విజయము
  • పన్నెండు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (12) భౌతిక ప్రపంచంలో విజయం
  • పదమూడు స్పటిక లింగముల ప్రతిష్ఠలు (13) సౌభాగ్యము, సౌమంగల్యమును నొసగును
  • పధ్నాలుగు స్పటిక లింగముల ప్రతిష్ఠలు (14) సర్వపాపములను తొలగించును
  • పదునైదు స్పటిక లింగముల ప్రతిష్ఠలు (15) అపమృత్యునివారణ, దీర్ఘాయుష్యు నొసగును
  • ఇరువది ఏడు స్ఫటిక లింగముల ప్రతిష్ఠలు (27) సమస్త వాస్తు దోష పరిహారము, నక్షత్రశాంతి సమకూరును
  • యాబది నాలుగుస్పటిక లింగముల ప్రతిష్ఠలు (54) – ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయములు తొలగును
  • ఆరువదినాలుగుస్పటిక లింగముల ప్రతిష్ఠలు (64) సాలోక్యమోక్షము నొసగును (కైలాస నివాసము)
  • నూట ఎనిమిది స్పటిక లింగముల ప్రతిష్ఠలు (108) సామీప్య మోక్షము నొసగును (పార్వతి పరమేశ్వరుల నిత్య దర్శన సేవ)
  • మూడువందల అరవైఐదుస్పటిక లింగముల ప్రతిష్ఠలు (365) సారూప్య మోక్షము నొసగును (సాక్షాత్ శంకర
  • సహస్ర స్పటిక లింగముల ప్రతిష్ఠలు    (1116) స్వరూపాన శివగణాది పత్యము పొందును)
  • సాయజ్ఞమోక్షము నొసగును (దేహానంతరము పరమేశ్వరునిలో లీనమగుట)

భూదాన సేకరణ

శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి ప్రతిరోజూ జరుగు ఉపచారాలలో ఉపయోగించుటకు వివిధ రకాల పళ్ళతోట, పూలతోట, కొబ్బరితోట, ఉసిరి, మామిడ్, బిల్వవనం ఏర్పాటు చేయుటకు మరియు గ్రామాలలో నిర్మాణము అవుతున్న దేవాలయములకు సహకారంగా ఉచితంగా ధ్వజస్థంభములు ఏర్పాటుకు యిందు నిమిత్తం భూదాన సేకరణ చేయుటకు బ్రహ్మచారి శివస్వామి మహాసంస్థానం సంకల్పించింది. ఇట్టి మహత్తరమైన కార్యక్రమములో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వరస్వామివారి అనుగ్రహ, ఆశీస్సులు పొంది తరించండి.

గురు ఉపదేశములు శివశబ్ద తరంగ మార్గము

భగవత్ జ్ఞానాన్ని పొందగోరే వారికి శుభ ఆహ్వానము
శిష్యులై జపదీక్షాధారులై భగవంతుని సేవలో తరించండి
శివశబ్ద తరంగ మార్గంలో ప్రవేశించబోయే శిష్యులకు అర్హతు
ఎవరు జపదీక్షా పరులుగా చేరవచ్చు

  1. ఈ జపదీక్షా సాధనలో ఏమతం, ఏ జాతి, ఏ వర్గం, ఏ గ్రామం, స్త్రీ, పురుషులు ఎవరైనా చేరవచ్చు.
  2. ఈ జపదీక్షా సాధనలో పుణ్యస్త్రీలు, వితంతువులు అనే తేడా లేకుండా ఎవరైననూ చేరవచ్చు.
  3. అలాగే పదవీ విరమణ పొంది, బాధ్యతలు అన్నీ తీరిపోయి మీ శేష జీవితాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాలనే ఉన్నత సంకల్పం కలవారు చేరవచ్చు.
  4. వివిధ సేవా సంస్థలలో, సంఘసేవకులుగా పనిచేస్తూ ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యంవైపు నడవాలనే కోరిక గలవారు చేరవచ్చు.

శివశబ్ద తరంగ మార్గము – గృహస్థులు- బ్రహ్మచారులు బ్రహ్మచారిణులు ఒక ఋషితుల్యుని ఆథ్యాత్మిక గురువుగా స్వీకరించమని హిందూ ధర్మం ఉపదేశిస్తుంది.

ధర్మోరక్షతి రక్షితః ఆధ్యాత్మిక త్రైమాసపత్రిక – జ్ఞానవ్యాప్తియజ్ఞంలో పాలుపంచుకోండి

శ్రీ శివపంచాక్షరీ జపధురీణులు, అర్షధర్మ ఉద్దరణ దీక్షాకంకణ బద్దులు, శ్రీ శైవక్షేత్ర వ్యవస్థాపకులు, శివదీక్షాపీఠాధిపతులు, పాదరస, రత్న, స్పటిక, పంచలోహ శివలింగాల స్థాపకులు, భారత ధర్మ దేవత బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ శివస్వామి వారి మానసపుత్రిక ‘ధర్మో రక్షతి రక్షితః’ త్రైమాసపత్రిక. వేదప్రయుక్త హైందవ సంస్కృతి సమున్నతికి. వేద విజ్ఞానాన్ని సమస్త హైందవులకు కరతలామలకం చేసేందుకు ‘ధర్మోరక్షతి రక్షితః’ అథ్యాత్మిక త్రైమాసపత్రిక. అందులోంచి వచ్చే జ్ఞానామృతాన్ని పాఠకులందరికీ పంచుకున్న వారికి పంచుకున్నంత అన్నట్లు అందచేయనుండి. హిందూ సంస్కృతి హిమాలయ శిఖరాలకంటే ఉన్నతంగా శోభిల్లాలని, ప్రపంచానికి తలమానికంగా వెలుగొందాలని మనసా వాచా కర్మణా ఆకాంక్షించేవారు అందరూ ఈ జ్ఞానవ్యాప్తి యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. ఏ పత్రిక మనుగడకైనా ప్రకటనలు, సభ్యత్వాలు వెన్నుముక, రక్తప్రసరణలాంటివి. యావత్ హిందూ ప్రపంచం గర్వించేలా ‘ధర్మోరక్షితి రక్షితః’ ఆథ్యాత్మిక త్రైమాసపత్రిక హిందూస్థాన్ నలుచెరగులా వ్యాపించాలంటే మీవంతు సహకారాన్ని పూర్తిగా అందించాల్సిందిగా కోరుతున్నాము. చందాదారులుగా చేరటము, చేర్పించటము, ప్రకటనలలు ఇవ్వటము, ఇప్పించటము ఇలా ఏదైనా మీకు చేతనైంది చేయవచ్చు.

మీ ఆధ్యాతిక ఉన్నతిని అభిలసిస్తూ…. పత్రికలోని ముఖ్య విశేషాలు

  1. పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామివారి అనుగ్రహ భాషణము
  2. శ్రీశ్రీశ్రీ బ్రహ్మచారి శివస్వామి మహాసంస్థాన విశేషాలు
  3. శ్రీ శైవక్షేత్ర నిత్య కార్యక్రమములు
  4. శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము – ప్రతిష్ఠలు
  5. విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా పూజ్య స్వామీజీలు, మాతాజీల దివ్య సందేశములు
  6. శివశబ్ద తరంగ మార్గము – గురూపదేశములు
  7. శ్రీశ్రీశ్రీ బ్రహ్మచారి శివస్వామి సేవక్ శివగణసేన – గ్రామాల సందడి
  8. శివదీక్షా పీఠము – ఆథ్యాత్మిక సేవలు
  9. భక్తుల, యోధుల, యోగుల, ఋషుల దివ్యచరితములు
  10. నీతి కథలు, చక్కని ముఖచిత్రములతో అనేక విశేషాలతో ధర్మోరక్షతి రక్షితః ఆధ్యాత్మిక త్రైమాసపత్రిక

భారత ధర్మదేవత

శ్రీశ్రీశ్రీ బ్రహ్మచారి శివస్వామి మహాసంస్థానము ద్వారా హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా జరుపు ఉచిత సేవా కార్యక్రమములు

సేవల వివరాలు
సేవల వివరాలు
క్ర.సం సేవల వివరాలు వ్యక్తుల సంఖ్య సేవా సమయం రోజులు ప్రదేశము / గమనిక
1 నామకరణము (అన్నప్రసాదం) 11 ఉ. 6 నుండి 11 వ॥కు ప్రతిరోజు శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ మహాగణపతి వార్ల దేవస్థానం
2 అన్నప్రాసన (అన్నప్రసాదం) 21 ఉ. 6 నుండి 11 వ॥కు ప్రతిరోజు శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ మహాగణపతి వార్ల దేవస్థానం
3 అక్షరాభ్యాసము 21 ఉ. 6 నుండి 11 వ॥కు ప్రతిరోజు శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ మహాగణపతి వార్ల దేవస్థానం
4 విద్యా, ఆరోగ్య ప్రాప్తికై – శ్రీ మహాసరస్వతి హోమం కుటుంబం (విద్యార్థినీ, విద్యార్థులు) సా. 5 నుండి 9 వ॥కు ప్రతినెల – పౌర్ణమి యాగశాల
5 శ్రీ అష్టపాశుపత సంపుటీకరణ – రుద్రాభిషేకం కుటుంబం ఉ. 8 నుండి 12 వరకు ప్రతినెల – మాసశివరాత్రి కార్యాలయము
6 వాహన పూజ 5 ఉ. 8 నుండి 12 వరకు ప్రతిరోజు శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ మహాగణపతి వార్ల దేవస్థానం
7 అన్నదానము మ. 1 నుండి 2:30 వరకు ప్రతిరోజు భోజనశాల
8 శ్రీ గురుపీఠము దర్శనం (పూజ్యశివస్వామివారు) 1 (టోకెన్ ద్వారా) ఉ. 8 నుండి 11 వరకు శని, ఆది కార్యాలయము
9 వివాహము 50 ముహూర్త నిర్ణయము ముహూర్త నిర్ణయము కళ్యాణమండపము
వివాహానికి 15 రోజులు ముందుగా పూర్తి చిరునామా, నివాస ధృవీకరణ పత్రం, వయస్సు నిర్ధారణ సర్టిఫికేట్ చూపి అనుమతిపత్రం పొందాలి

వివాహమునకు 15 రోజులు ముందుగా మీ పూర్తి చిరునామా, నివాసధృవీకరణపత్రము, వయస్సు నిర్ధారణ సర్టిఫికేట్ చూపి అనుమతిపత్రం పొందగలరు.

గమనిక: పై కార్యక్రమముల నిమిత్తము సంస్థాన కార్యాలయమునందు సంప్రదించి అనుమతిపత్రము పొందవలెను.

భారత ధర్మదేవత

శ్రీశ్రీశ్రీ బ్రహ్మచారి శివస్వామి మహాసంస్థానం సేవలు

  1. పౌర్ణమి పూజలు – పౌర్ణమి పూజలలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు ప్రతి మాసము పౌర్ణమి రోజు విద్యార్థినీ, విద్యార్థులచే విద్యాభివృద్ధి మరియు ఆరోగ్య నిమిత్తమునకై శ్రీ మహాసరస్వతి హోమము సేవా మార్గము (ఉచితము)గా చేయించబడును.
  1. అన్న ప్రసాద వితరణ – స్వీకరిస్తున్న భక్తులు భూ గృహములో ప్రతిష్ఠితులై వున్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివార్లకు అన్నాభిషేకము జరుగును. ఈ అభిషేక అన్న ప్రసాదాన్ని క్షేత్రమునకు విచ్చేయు భక్తులందరికి వితరణ జరుగును.
  1. శివశబ్ద తరంగ మార్గము గురు ఉపదేశములు – మంత్ర దీక్షను స్వీకరించి, మంత్ర జపము చేస్తున్న దీక్షాపరులు స్వామివారికి పాదపూజ చేస్తున్న దీక్షాపరులు
  1. ఆలయ జీర్ణోర్దరణలు – ప్రతిష్ఠలు మహా సంస్థానము ఆధ్వర్యములో పరమపూజ శ్రీశ్రీశ్రీ శివస్వామివారి యొక్క ఆశీస్సులతో ఇప్పటివరకు 100కు పైగా ఆలయములు జీర్ణోర్ధరణ మరియు ప్రతిష్ఠలు జరిగినవి.
  1. ధర్మ సేవలలో పాల్గొనండి ధర్మ హుండీలు స్వీకరించండి – ధర్మ హుండీల ద్వారా స్వీకరించిన ధనాన్ని అన్నదానము, గోసేవ, ఆలయముల పునరుద్ధరణ కార్యక్రమములకు వినియోగించబడును.
  1. జ్ఞాన యజ్ఞములు క్తులకు జ్ఞానబోధ చేస్తున్న శ్రీశ్రీశ్రీ శివస్వామివారు
  2. మాస శివరాత్రి తీర్థములు – ప్రతి మాస శివరాత్రి రోజున భక్తులు ఆరోగ్యము కొరకు శ్రీ అష్టపాశుపత సంపుటీకరణ రుద్రాభిషేకములు జరిపి విచ్చేయు భక్తులకు తీర్థప్రసాదములు అందజేయబడతాయి.
  1. అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నామకరణ – హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నామకరణ కార్యక్రమములు ధర్మసేవలుగా (ఉ చితముగా) చేయబడును.
  1. శ్రీ కోటిలింగ ప్రతిష్ఠా సంకల్పము – కోటిలింగ ప్రతిష్ఠలో భాగంగా భక్తులు తమ స్వహస్తములతో ప్రతినిత్యము శివలింగములను ప్రతిష్టించుకొనవచ్చును.
  1. విశ్వధర్మ పరిరక్షణ వేదిక – ధర్మపరిరక్షణలో పాల్గొన్న స్వామీజీలు మాతాజీలు 
  2. శ్రీశ్రీశ్రీ బ్రహ్మచారి శివస్వామి సేవక్ – సేవా సభ్యత్వము తీసుకున్నవారిని ధర్మదీక్షాపరులు అంటారు. మహాసంస్థానము ద్వారా జరుగు ధర్మసేవా కార్యక్రమములలో వీరు పాల్గొనవచ్చును.
  1. పీఠ కార్యక్రమములు – శ్రీశైవక్షేత్ర అధిష్టాన మూర్తులైన శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీకోటిలింగేశ్వరస్వామివారు, శ్రీ అష్టభైరవుల సమేత శ్రీ భైరవీదేవి సమేత శ్రీ మహాకాలభైరవస్వామివారు, షణ్మత పీఠము మరియు మహాసంస్థానము ద్వారా భారతదేశంలో స్థాపించబడు 12 పీఠములలో ప్రతిష్టించు 12 స్పటికలింగములను మీ స్వగృహమునకు తీసుకువచ్చి మీ స్వహస్తములతో అర్చనాభిషేకమలు చేయించబడును.
  1. శివశబ్దతరంగ మార్గము జపయజ్ఞము – ప్రతిపౌర్ణమిరోజు సామూహిక జపయజ్ఞములు జరుగును. సామూహిక జపయజ్ఞములో పాల్గొన్న దీక్షాపరులు
  1. శివసహస్రనామ పారాయణము – సామూహిక శివసహస్రనామ పారాయణ చేస్తున్న భక్తులు
  1. యజ్ఞ కార్యక్రమములు – విశ్వశాంతి, లోక కళ్యాణార్ధము శ్రీశైవక్షేత్రమువారిచే వివిధ ప్రదేశాలలో యజ్ఞ కార్యక్రమములు జరుగును.
  1. రుద్రాక్ష ప్రసాదము – పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామివారిని దర్శించు భక్తులకు స్వామివారి స్వహస్తములతో పంచముఖ రుద్రాక్ష ప్రసాదముగా యివ్వబడును. ఈ రుద్రాక్ష ధారణకు ఏ విధమైన నియమ నిబంధనలు లేవు. పుణ్యస్త్రీలు, వితంతువులు అందరూ ధరించవచ్చును.

శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము

  1. ఈ క్షేత్రములో పూజలకు రుసుములు లేవు.
  2. ఈ క్షేత్రమునందు దర్శనమునకు టిక్కెట్లు లేవు
  3. ఈ క్షేత్రమునందు అభిషేకములకు కులమత పట్టింపులు లేవు.
  4. ఈ క్షేత్రమునందు పూజారులకు దక్షిణలు లేవు.